Site icon NTV Telugu

Sergey Lavrov: యుద్ధం ముగించాలంటే.. ఉక్రెయిన్ ఆ షరతుల్ని పూర్తి చేయాలి

Sergey Lavrov

Sergey Lavrov

Sergey Lavrov issues ultimatum to Ukraine: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలంటే.. తమ షరుతల్ని ఆ దేశం పూర్తి చేయాలని, అవేంటో ఆ దేశానికి తెలుసని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. తమ షరుతుల్ని పూర్తి చేస్తే ఉక్రెయిన్‌కి మంచిదని.. లేకపోతే తమ సైన్యం నిర్ణయిస్తుందంటూ ఆయన నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం రష్యా అధీనంలో ఉన్న ఉక్రేనియన్ భూభాగాల్ని సైతం తమకు అప్పగించాలని అన్నారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. తాము చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన చేసిన కొన్ని రోజుల్లోనే సెర్గీ లావ్రోవ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Namaz Controversy: క్యాంపస్‌లో నమాజ్ చదివిన విద్యార్థులు.. రాజుకున్న వివాదం

‘‘ఉక్రెయిన్ పాలనలో నిస్సైనికీకరణ, నాజీరహితంగా చేసి.. అక్కడి నుంచి రష్యాకు ఉన్న ముప్పుని తొలగించాలన్నదే మా ప్రతిపాదన. ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఆక్రమించిన కొత్త భూభాగాలతో పాటు రష్యా భద్రతకు ఉక్రెయిన్ నుంచి ఎలాంటి బెదిరింపులకు రాకూడదు. ఈ విషయాలన్నీ మా ప్రత్యర్థికి బాగా తెలుసు’’ అని సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నట్లు స్టేట్ న్యూస్ ఏజెన్సీ టాస్(TASS) తెలిపింది. ‘‘ఇది చాలా సింపుల్ పాయింట్. తమ షరతుల్ని పూర్తి చేస్తే, ఉక్రెయిన్‌కే మంచిది. లేకపోతే వారి భవిష్యత్‌ని రష్యా సైన్యం నిర్ణయిస్తుంది’’ అంటూ హెచ్చరించారు కూడా! మరి యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని ప్రశ్నించగా.. ‘‘బంతి వారి కోర్తులోనే ఉందని, వారి వెనుక వాషింగ్టన్ ఉందని ఆయన చెప్పుకొచ్చాడు.

Mock Drill: దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. సంసిద్ధంగా గాంధీ హాస్పిట‌ల్‌

అంతకుముందు ఆదివారం చర్చలకు మాస్కో సిద్ధంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించాడు. కానీ.. వాషింగ్టన్ మద్దతుతో కీవ్ అందుకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. కాగా.. 11 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో రష్యాకి కూడా కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే.. ఈమధ్య ఉక్రెయిన్‌పై దాడుల్ని రష్యా ఉధృతం చేసింది. మిసైల్స్, డ్రోన్ దాడుల ద్వారా ఉక్రెయిన్ సివిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని దెబ్బతీసింది. ఈ దాడుల కారణంగా.. లక్షలాది మంది అంధకారంలోకి వెళ్లిపోయారు. నీటి సమస్య కూడా వారిని ఇబ్బంది పెడుతోంది. మరోవైపు.. చర్చల ద్వారా ఈ యుద్ధానికి స్వస్తి పలకాలని మోడీ ఇరు దేశాల అధినేతలతో పలుసార్లు ఫోన్‌లో మాట్లాడారు.

Exit mobile version