NTV Telugu Site icon

Hamas-Israel: చనిపోయాడనుకున్న హమాస్ కమాండర్ ప్రత్యక్షం.. షాకైన ఐడీఎఫ్!

Husseinfiad

Husseinfiad

హమాస్‌ అంతమే లక్ష్యంగా జరిగిన యుద్ధంలో ఐడీఎఫ్ ఎన్నో ఘన విజయాలను సాధించింది. కీలక అగ్ర నేతలందరినీ మట్టుబెట్టింది. హమాస్ అగ్ర నేత హనియే, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా లాంటి ఖ్యాతి గడించిన నాయకులందరినీ ఇజ్రాయెల్ అంతం చేసింది. కానీ తాజాగా ఐడీఎఫ్‌కు భారీ షాక్ తగిలింంది. గత మే నెలలో చనిపోయాడనుకున్న హమాస్ సీనియర్ నాయకుడు హుస్సేన్ ఫయాద్ తాజాగా గాజాలో ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ షాక్‌కు గురైంది. అంతేకాకుండా ఐడీఎఫ్ సామర్థ్యంపై సందేహాలు లేవనెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి: Maharastra : ఆర్మీ ఆయుధ కర్మాగారంలో పేలుడు.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య..ఘటనకు కారణం ఏంటంటే ?

అక్టోబర్ 7, 2023న హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. హమాస్ నాయకులను మట్టుబెట్టింది. ఈ పరిణామంలో గత మే నెలలో హమాస్ సీనియర్ కమాండర్ హుస్సేన్ ఫియాద్ చనిపోయినట్లుగా ఐడీఎఫ్ అధికారికంగా ప్రకటించింది. కానీ తాజాగా అతడు.. ఇజ్రాయెల్‌కు షాకిచ్చాడు. అతడు ఇంకా బతికే ఉన్నాడు. ఇటీవల విడుదల చేసిన వీడియోలో ఫియాద్ కనిపించాడు. దీంతో అతడు చనిపోలేదు. ఐడీఎఫ్‌కే షాకిచ్చాడు. ఫియాద్ విషయంలో అంచనాలు తారుమారు అయినట్లుగా తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ అయిన వీడియో తేదీ లేదు గానీ.. తాజా వీడియోనే అని మాత్రం అర్థమవుతోంది.

ఇది కూడా చదవండి: Tirumala: రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల..

చనిపోయాడనుకున్న హుస్సేన్ ఫయాద్ సజీవంగా ప్రత్యక్షం కావడంతో హమాస్‌కు ఊపిరిపోసినట్లైంది. అతడి ఆధ్వర్యంలో కొత్త జీవం పోసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫయాద్ సజీవంగా ఉండడంతో హమాస్ పూర్తిగా అంతం కాలేదని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం జరగడంతో బాంబు దాడులు తగ్గాయి. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

ఏడాదికి పైగా జరిగిన యుద్ధంలో వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. గాజాను పూర్తిగా ఐడీఎఫ్ ధ్వంసం చేసింది. అయితే ఇటీవల ఖతర్, అమెరికా జోక్యంతో రెండు దేశాల మధ్య ఒప్పందం జరగడంతో కాల్పులు ఆగాయి. అలాగే కొంత మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. అలాగే ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనీయులను కూడా విడిచిపెట్టింది.