NTV Telugu Site icon

India And Taiwan: ఇండియాకు సెమీకండక్టర్ పరిశ్రమ.. చైనా నుంచి తరలనున్న తైవాన్‌ కంపెనీ

India And Taiwan

India And Taiwan

India And Taiwan: ఇండియాకు మరో టెక్‌ కంపెనీ రాబోతోంది. చైనాలో ఉన్న తైవాన్‌కు చెందిన సెమీకండక్టర్‌కు చెందిన టెక్‌ కంపెనీని ఇండియాకు తరలించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. చైనా, తైవాన్‌ల మధ్య సత్సంబంధాలు అంతంత మాత్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే చైనాలో కొనసాగుతున్న కంపెనీలను తైవాన్‌ ఇతర దేశాలకు తరలించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా చైనాలో కొనసాగుతున్న సెమీకండక్టర్‌ పరిశ్రమలను ఇండియాకు తరలించాలనే యోచనలో తైవాన్‌ ఉన్నట్టు తెలిసింది.

Read also: Gutha Sukender Reddy: పాదయాత్ర చేసిన భట్టినే ఖమ్మం సభలో పక్కకు నెట్టారు

తైవాన్‌ను .. చైనా తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. తైవాన్ హక్కులను చైనా అణచివేస్తోంది. దీనిపై తైవాన్ పోరాటం కొనసాగుతోంది. ఫలితంగా, తైవాన్ టెక్ దిగ్గజం బీజింగ్ నుండి భారతదేశానికి మకాం మార్చాలని నిర్ణయించుకుంది. ఇది భారత్‌కు లభించిన భారీ విజయంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ తైవాన్ కంపెనీ సెమీకండక్టర్లతో సహా అధిక డిమాండ్ ఉన్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తే సెమీకండక్టర్ చిప్స్ కొరత సమస్య పరిష్కారమవుతుంది. దాంతోపాటు వేలాది మందికి ఉపాధి కల్పించబడుతుంది. అంతే కాకుండా భారత్, తైవాన్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తైవాన్ జాతీయ అభివృద్ధి మంత్రి కావో షీన్ క్యూ ఈ విషయంలో ఒక ముఖ్యమైన సూచన ఇచ్చారు. చైనా వైఖరి తైవాన్ పట్ల వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలోనే ఈ టెక్ దిగ్గజం భారత్ వైపు మొగ్గు చూపింది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని కావో షైన్ క్యూ చెప్పారు.

Read also: Gold Royal Enfield: బంగారంతో బుల్లెట్ బైక్.. స్పెషల్ అట్రాక్షన్ గా శివాజీ స్టాచ్యు

తైవాన్ కంపెనీ ప్రపంచ సరఫరా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి భారతదేశం కంటే మెరుగైన మరియు సురక్షితమైన ప్రదేశం మరొకటి లేదని.. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అవతరిస్తోంది. ప్రపంచ సరఫరా గొలుసులో ఆధిపత్యం చెలాయించాలని చైనా సవాలు చేస్తోంది. కంపెనీ వృద్ధి అంచనాల కంటే భారత్‌లో వాణిజ్య స్నేహపూర్వక వాతావరణం మెరుగ్గా ఉందని తైవాన్ ఏషియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ క్రిస్టీ సున్ ట్జు తెలిపారు. చైనా, తైవాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తైవాన్‌పై ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నాలు గతంలో కంటే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల చైనాలోని తైవాన్ కంపెనీల భద్రతపై ఆందోళన నెలకొంది. దాడులు, అల్లర్ల కారణంగా తైవాన్ కంపెనీలు మరింత నష్టపోయే అవకాశం ఉందని చాలా మంది తైవాన్ పరిశ్రమ నిపుణులు చైనా నుండి భారతదేశానికి వెళ్లడం సురక్షితమైనదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే భారతదేశంలోని తైవాన్ కంపెనీలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్ ఉత్పత్తి వాటాలో తైవాన్ టెక్ కంపెనీలు 70 శాతం కలిగి ఉన్నాయి. ఇప్పుడు చిప్ మార్కెట్‌లో 90 శాతం వాటాను కలిగి ఉంది. ఈ కంపెనీలు భారత్ వైపు మొగ్గు చూపితే.. ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ నంబర్ 1 అవుతుందని పరిశ్రమల నిపుణులు చెబుతున్నారు.