Site icon NTV Telugu

కొత్త వేరియంట్ల పుట్టుక‌పై శాస్త్ర‌వేత్త‌ల కీల‌క ప‌రిశోధ‌న‌…

క‌రోనా మ‌హ‌మ్మారి గ‌త రెండేళ్లుగా ప్ర‌పంచాన్ని ఇబ్బందుల‌కు గురిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. కారోనా మ‌హ‌మ్మారిలో సార్స్‌కోవ్ 2, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు ప్ర‌పంచంపై దాడి చేశాయి. సార్స్‌కోవ్ 2, డెల్టా వేరియంట్లు తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూప‌గా, ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్న‌ప్ప‌టికీ తీవ్ర‌త త‌క్కువ‌గా ఉన్న‌ది. అయితే, కొత్త వేరియంట్లు ఎప్పుడు ఎలా పుట్టుకొస్తాయో ముందుగానే గ‌మ‌నిస్తే వాటిని ఎదుర్కొన‌డం తేలిక అవుతుంది. దీంతో శాస్త్ర‌వేత్త‌లు కొత్త వేరియంట్ల పుట్టుక‌పై దృష్టి సారించారు. కొత్త వేరియంట్ల పుట్టుక‌ను తెలుసుకోవ‌డానికి శాస్త్ర‌వేత్త‌లు మురికినీటిపై ప‌రిశోధ‌న‌లు చేశారు. న్యూయార్క్‌లోని 14 మురుగునీటి కాల్వ‌ల నుంచి మురుగునీటిని తెప్పించుకొని క్వీన్స్‌బ‌రో యూనివ‌ర్శిటీకి చెందిన శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేశారు.

Read: LIVE: 216 అడుగుల సమతా మూర్తి విగ్రహావిష్కరణలో ప్రధాని మోదీ

ఈ మురుగునీటిలో ఇప్ప‌టి వ‌రకు విజృంభించిన క‌రోనా వేరియంట్ల‌తో పాటు బ‌హిర్గ‌తం కాని కొన్ని ఉత్ప‌రివ‌ర్త‌నాల‌తో కూడిన కొత్త వైర‌స్ ర‌కాల‌ను కూడా శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. అయితే, ఈ కొత్త ఉత్ప‌రివ‌ర్త‌నాలతో కూడిన వైర‌స్‌లు మురుగునీటిలోకి ఎలా వ‌చ్చాయి, వీటి వ‌ల‌న మాన‌వాళికి ఇబ్బందులు ఉన్నాయా అనే దానిపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న వైర‌స్‌ల‌ను నిఘూడ వేరియంట్లుగా గుర్తించారు. వీటితో పాటు కొత్త‌గా క‌నుగోన్న వైర‌స్ మూలాల‌ను శాస్త్ర‌వేత్త‌లు ఇంకా గుర్తించాల్సి ఉన్న‌ది.

Exit mobile version