TOI-6713.01: “తనలో తాను కరుగుతున్న వింత గ్రహం”.. గురుడి ఉపగ్రహంతో పోలిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Io on steroids: ఖగోళ శాస్త్రవేత్తలు విశాల విశ్వంలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. సౌర కుటుంబం వెలుపల ఉన్న గ్రహాలపై శాస్త్రవేత్తలకు ఎప్పటి నుంచో ఆసక్తి నెలకొని ఉంది. ఈ ఆసక్తి కారణంగా ఎన్నో ఎక్సోప్లానెట్స్ వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా జీవానికి యోగ్యంగా ఉండే గ్రహాల కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్న గ్రహం మాత్రం ఇప్పటి వరకు కనుగొన్న వాటి కన్నా చాలా భిన్నంగా ఉంది.
శాస్త్రవేత్తలు ‘‘తనలో తాను కరుగుతున్న’’ వింత గ్రహాన్ని కనుగొన్నారు. ఒక విధంగా చెప్పాలంటనే తనను తాను తింటున్నట్లు. లైవ్ సైన్స్ నివేదికలో ఈ గ్రహం గురించిన వివరాలు ప్రచురించారు. ఈ ఎక్సోప్లానెట్‌కి TOI-6713.01 అని పేరు పెట్టారు. ఇది చాలా చురుకైన అగ్నిపర్వతాలను కలిగి ఉంది. అవి నిరంతరం విస్పోటనం చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది అంతరిక్షం నుంచి చూసినప్పుడు మండుతున్న ఎర్రటి మెరుపును గుర్తుకు తెస్తుంది. ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి గ్రహం కనిపించలేదని, దీనికి సంబంధించిన మరిన్ని లక్షణాలు తెలుసుకోవడానికి మరింత పరిశీలన అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
Also Read
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
- Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
Read Also: West Bengal: బీజేపీ ఎంపీ అభ్యర్థిపై రాళ్లదాడి.. పరుగులు తీసిన భద్రతా సిబ్బంది, మీడియా..
ఈ గ్రహం భూమికి 66 కాంతి సంవత్సరాల దూరంలో ఒక మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. భూమి పరిమాణంతో పోలిస్తే కాస్త పెద్దగా ఉన్న ఈ గ్రహం 2.2 రోజుల్లోనే దాని కక్ష్యను పూర్తి చేస్తోంది. NASA యొక్క ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) గ్రహం యొక్క ఉపరితలం అగ్నిపర్వతాల లావాతో కప్పబడి ఉన్నట్లు గుర్తించింది. అక్కడ ఉష్ణోగ్రత 2300 డిగ్రీ సెల్సియస్ మించిపోయింది. పరిశోధకులు ఈ గ్రహాన్ని ‘‘అయో ఆన్ స్టెరాయిడ్స్’’గా అభివర్ణించారు. అయో(Io) అనేది గురుడి ఉపగ్రహాల్లో ఒకటి. మన సౌరవ్యవస్థలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాలను కలిగి ఉంది. ఇది గురు గ్రహం యొక్క మూడో అతిపెద్ద చంద్రుడు. ఈ గ్రహం ప్రతీ అంగుళం కూడా అగ్నిపర్వతాలతో కప్పబడి, నిత్యం క్రియాశీలకంగా ఉంటుంది. దీంతో కొత్తగా కనుగొన్న గ్రహాన్ని అయోతో పోల్చారు.
కొత్తగా కనుగొనబడిన గ్రహం ఆర్బిట్ బుధుడి లాగా అత్యంత దీర్ఘవృత్తాకారంలో ఉందని Space.com తెలిపింది. TOI-6713.01 గ్రహం తన నక్షత్రాన్ని దాదాపుగా తాకే దూరంలో ఉంది. మరో రెండు గ్రహాలు ఈ గ్రహంపై గురుత్వాకర్షణ శక్తిని చూపిస్తున్నాయి. దీని ఫలితంగా గ్రహంలో కరిగిన సున్నితమైన భాగాన్ని విస్తరించడం లేదా, ట్విస్ట్ చేయడం జరుగుతోంది. గ్రహం క్రమం తప్పకుండా దాని నక్షత్రానికి దగ్గరగా , ఆపై దూరంగా కక్ష్యలో ఉంటుంది.
తాజావార్తలు
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
-
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
ట్రెండింగ్
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!