Site icon NTV Telugu

వందేళ్ల‌కు కాదు… మ‌రో 60 ఏళ్లలోనే మ‌రో ముప్పు…!!

ప్ర‌తి వందేళ్ల‌కు ఒక‌సారి ప్ర‌పంచాన్ని మ‌హ‌మ్మారులు చుట్టుముడుతున్నాయి.  భారీ ప్ర‌జాన‌ష్టం జ‌రుగుతున్న‌ది.  గ‌తంలో చూసుకుంటే వందేళ్ల‌కు ఒక‌సారి క‌రోనా లాంటి వైర‌స్‌లు దాడి చేస్తున్నాయి.  అయితే, తాజాగా ఇట‌లీకి చెందిన డ్యూక్ విశ్వ‌విద్యాల‌యం శాస్త్ర‌వేత్త‌లు మ‌హమ్మారుల‌పై ప‌రిశోధ‌న‌లు చేశారు.  వీరి ప‌రిశోధ‌న‌ల‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.  గ‌తంలో జ‌రుగుతున్న‌ట్టుగా 100 ఏళ్ల‌కు కాకుండా ఇక‌పై ప్ర‌తి 60 ఏళ్ల‌కు ప్ర‌పంచాన్ని భ‌య‌ప‌ట్టే మ‌హ‌మ్మారులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, 2080లో మ‌రోసారి ప్ర‌పంచం మ‌హ‌మ్మారుల బారిన పడుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.  గ‌త 400 ఏళ్ల కాలంలో వ‌చ్చిన చికిత్స‌లేని మ‌హ‌మ్మారుల గ‌ణాంకాల‌ను తీసుకొని డాక్ట‌ర్ మార్కో మ‌రానీ బృందం ప‌రిశోధ‌న‌లు చేశారు.  గ‌తంలో వ‌చ్చిన మ‌హమ్మారుల వైర‌స్ కంటే, రాబోయే రోజుల్లో వ‌చ్చే మ‌హ‌మ్మారులు మ‌రింత భ‌యంక‌రంగా ఉంటాయ‌ని, రాబోయే 60 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా క‌రోనా కంటే బ‌ల‌మైన మ‌హ‌మ్మారులు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఇట‌లీ శాస్త్ర‌వేత్త‌ల బృందం ప‌రిశోధ‌న‌లో తేలింది.  12 వేల ఏళ్లో మాన‌వ‌జాతిని అంతం చేసే మ‌హ‌మ్మారులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌ల బృందం పేర్కొన్న‌ది. 

Read: ఆ ఖజానా తాలిబన్లు కు దక్కుతుందా?

Exit mobile version