Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
- పాకిస్తాన్‌కు దెబ్బేసిన టర్కీ, పాకిస్తాన్..
- కష్టకాలంలో అండగా నిలుస్తున్న ఫ్రాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Houthi War: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చుక్కలు చూపిస్తున్నారు. వరసగా సౌదీ పట్టణాలు, ఆయిల్ మౌలిక సదుపాయాలపై దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు, తన రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న ‘‘సౌదీ అరేబియా-పాకిస్తాన్-టర్కీ’’ల ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ సహాయపడటం లేదు. సౌదీ దాడులకు గురవుతున్నా కేవలం పాకిస్తాన్ మాటలకు మాత్రమే పరిమితమైంది.
అండగా నిలుస్తున్న ఫ్రాన్స్..
Also Read
- Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
- Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
ఇదిలా ఉంటే, కష్టకాలంలో సౌదీ అరేబియాకు ఫ్రాన్స్ అండగా నిలుస్తోంది. మక్కా కూటమి, అమెరికా దూరంగా ఉన్న ఈ సమయంలో ఫ్రాన్స్ సైనిక సహాయాన్ని ప్రకటించింది. తమ దేశ సైనికులు, రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పంపనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తెలిపారు. హౌతీలోత ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనడం ఫ్రాన్స్ లక్ష్యం కాదని, సౌదీ అరేబియా ఇంధన మౌలిక సదుపాయాలను రక్షించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
యాన్బు రక్షణకే మొదటి ప్రాధాన్యం..
యాన్బును రక్షించడమే తమ ప్రాధాన్యమని ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పారు. యాన్బు సౌదీఅరేబియాలోని కీలక ఓడరేవు. సౌదీ ఇంధన వ్యవస్థలో అత్యంత కీలకమైంది. ఎర్ర సముద్రం ఒడ్డున ఉన్న ఈ నగరంలో పెద్ద చమురు నిల్వ, చమురు శుద్ది కర్మాగారాలు ఉన్నాయి. తూర్పు-పశ్చిమ పైప్‌లైన్ కూడా ఇక్కడే అనుసంధానించబడి ఉంటుంది. ఈ పైప్‌లైన్ పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది. ఎర్ర సముద్రం మీదుగా తన చమురును ప్రపంచ దేశాలకు పంపుతోంది. ఈ పైప్ లైన్ సామర్థ్యం రోజుకు 7 మిలియన్ బ్యారెళ్లు. యాన్బును లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడుకలు ప్రయత్నిస్తున్నారు.
టర్కీ, పాక్ తీరుతో సౌదీ అసంతృప్తి..
తమకు ఎంతో అండగా నిలుస్తాయని భావించిన పాక్, టర్కీలు ఆపద సమయంలో సౌదీకి దెబ్బేశాయి. ఈ రెండు దేశాలు ఇప్పటి వరకు మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. ప్రత్యక్షంగా సైనిక సహాయాన్ని చేయలేదు. హౌతీల దాడుల తర్వాత మూడు దేశాల విదేశాంగ మంత్రులు, సైనిక అధిపతుల మధ్య చర్చలు జరిగినా కూడా పెద్దగా సౌదీకి ఒరిగింది ఏమీ లేదు. ఈ సమయంలోనే తమకు మద్దతుగా హౌతీలపై దాడులు చేయాలని సౌదీ అమెరికాను కోరింది. సౌదీ కోరికను అమెరికా పట్టించుకోలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎంతో కొంత ఫ్రాన్స్ అండగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!