Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..

  • బంగ్లాదేశీయుల మరణశిక్షపై ప్రపంచవ్యాప్త ఆగ్రహం..
  • సౌదీ అరేబియాలో నజ్రుల్ అస్లాం, సితి అక్తర్‌కు మరణశిక్ష అమలు..
  • తమకు సమాచారమే లేదని చెబుతున్న బంగ్లాదేశ్..
  • మసీదులో అనైతిక చర్యలకు పాల్పడినట్లు సౌదీ ఆరోపణ..
Saudi Arabia

Saudi Arabia

సౌదీ అరేబియాలో ఇద్దరు బంగ్లాదేశ్ వలస కార్మికులకు మరణశిక్ష విధించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మక్కాలోని ఓ మసీదులో ‘అనైతిక చర్యలకు’ పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక జంటను అక్టోబర్ 14న మరణశిక్ష చంపినట్లు సౌదీ మీడియా వెల్లడించింది. అయితే, అసలు వీరిద్దరు చేసిన నేరం.? విచారణ ఎలా సాగింది? బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇచ్చారా.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఘటనపై బంగ్లాదేశ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నజ్రుల్ ఇస్లాం, సితి అఖ్తర్‌ అనే జంటకు మరణశిక్ష విధించారు. మక్కాలోని పవిత్ర మసీదులో ‘అనైతిక చర్య’కు పాల్పడ్డారని సౌదీ చెబుతోంది. కానీ అసలు ఆ చర్యలు ఏమిటో సౌదీ అధికారులు చెప్పడం లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. మసీదులో ముద్దు పెట్టుకున్నందుకే వీరిద్దరికి మరణశిక్ష విధించారని తెలుస్తోంది. సితిని నజ్రుల్ నుదిటిపై మాత్రమే ముద్దు పెట్టుకున్నాడనే వాదన కూడా ఉంది.

నజ్రులు ఎవరు.. ఆయన తండ్రి ఏం చెబుతున్నారు.?

నజ్రుల్ ఇస్లాం బంగ్లాదేశ్‌లోని చటచట్టోగ్రామ్ డివిజన్ పరిధిలోని బ్రాహ్మణబారియా సదర్ ప్రాంతానికి చెందినవాడు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు 2022 నవంబర్‌లో సౌదీ అరేబియాకు వెళ్లాడు. మక్కాలోని మస్జిద్ అల్ హరామ్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్నట్లు బంగ్లా మీడియా పేర్కొంది. నజ్రులు కుటుంబ సభ్యుల ప్రకారం.. నజ్రుల్ సౌదీ వెళ్లిన 8 నెలలకే జైలు పాలయ్యాడని చెబుతున్నారు. అప్పటి నుంచి మరణశిక్ష అమలయ్యే వరకు జైలులోనే ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. అక్టోబర్ 11న నజ్రుల్‌తో చివరిసారిగా మాట్లాడినట్లు కుటుంబం చెబుతోంది. అక్టోబర్ 14న మరణశిక్ష అమలైనట్లు ఫోన్ ద్వారా సమాచారం అందిందని చెబుతున్నారు.

నజ్రుల్ తండ్రి అబ్దుల్ బాసిర్ గతంలో 24 ఏళ్ల పాటు సౌదీలో పనిచేశారు. తన కుమారుడికి న్యాయమైన విచారణ జరిగిందా? అన్యాయంగా శిక్ష విధిస్తే తనకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమవుతున్నారు. నజ్రుల్ చాలా మర్యాదస్తుడని అతడి కుటుంబం చెబుతోంది.

సితి అఖ్తర్ నజ్రుల్ భార్య కాదా.?

సితి అఖ్తర్, నజ్రుల్‌తో ఉన్న సంబంధంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. నజ్రుల్ తండ్రి అబ్దుల్ బాసిర్ ప్రకారం.. సితి తన కుమారుడి భార్య కదాని, ఆమె ఎవరో తెలియనది చెప్పినట్లు అక్కడి మీడియా పేర్కొంది. అయితే, నజ్రుల్‌, సితి మధ్య ప్రమే సంబంధం ఉందని అతడి కుటుంబంలో కొంతమంది చెబుతున్నారు.

మరణశిక్షపై ఆగ్రహావేశాలు:

ఇద్దరిపై ఏ ఆరోపణలు ఉన్నాయనేది వెల్లడించకపోవడం, విచారణలో సరైన విధానం పాటించారో లేదో తెలియపరకపోవడం, కుటుంబాలకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వంటి అంశాలు ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి. బంగ్లాదేశ్ జర్నలిస్టులు, న్యాయవాదులు ఈ కేసులో పారదర్శకతను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, తన పౌరులకు విధించిన శిక్షపై తమకు సమాచారం లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది. అక్టోబర్ 14న మరణశిక్షలు అమలైన విషయం తమకు ముందుగా తెలియదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షమా ఒబైద్ ఇస్లాం అన్నారు.

సౌదీ అరేబియాలో మరణశిక్షలు అమలు కావడం ఇదే తొలిసారి కాదు. హ్యుమన్ రైట్స్ వాచ్ ప్రకారం.. 2025లో అక్కడ 356 మందికి మరణశిక్ష అమలైంది. వీరిలో ఎక్కువ మంది డ్రగ్స్ కేసులోనే శిక్షలు ఎదుర్కొన్నారు. తాజా కేసులో ఇద్దరికి ఇస్లామిక్ చట్టంలోని ‘తాజిర్’ విభాగం కింద మరణశిక్ష విధించబడింది, ఈ విభాగం ప్రకారం శిక్షను నిర్ణయించే అధికారం న్యాయవ్యవస్థకు ఉంటుంది.