Saudi Arabia: 56,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా..
- 56,000 మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ..
- పాక్ బిచ్చగాళ్లతో యూఏఈ, సౌదీ, బహ్రయిన్ ఆందోళన..
- నో -ఫ్లై లిస్ట్, వీసా నిబంధనలు ఉన్నా ఆయా దేశాల్లో భిక్షాటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia: వీసా ఆంక్షలు, నో-ఫ్లై జాబితాలు, విదేశాల బహిష్కరణలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్లు మాత్రం యథేచ్చగా విదేశాల్లో భిక్షాటన చేస్తూనే ఉన్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, అజన్ బైజాన్ దేశాల్లో పాకిస్తాన్ బిచ్చగాళ్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయా దేశాలు దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద తమ ఆందోళనల్ని వ్యక్తపరుస్తోంది. పాకిస్తాన్‌ను బిచ్చగాళ్ల ఎగుమతిని ఆపేయాలని హెచ్చరిస్తున్నాయి. మక్కా, మదీనా వంటి ఇస్లాం పవిత్ర స్థలాలు ఉన్న సౌదీ అరేబియా ఇటీవల తన దేశం నుంచి 56,000 మంది పాకిస్తానీయులను బహిష్కరించింది. ఈ వ్యవస్థీకృత ముఠాలు విదేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2025లో 66,154 మంది ప్రయాణికులను జాబితాను సిద్ధం చేసింది.
Read Also: PM Modi: ప్రధాని మోడీకి ఒమన్ అత్యున్నత పురస్కారం.. ‘‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’’ ప్రదానం..
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
గత నెలలో, తమ దేశంలో నేర కార్యకలాపాలకు పాల్పడటం, భిక్షాటన చేస్తున్నారనే ఆందోళన నేపథ్యంలో యూఏఈ చాలా మంది పాకిస్తానీలకు వీసాలను ఆపేసింది. పాకిస్తాన్ వేలాది మంది పౌరులను ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ (ECL) లేదా నో-ఫ్లై జాబితాలో ఉంచిన నెలల తర్వాత పాకిస్తాన్ పార్లమెంటరీ ప్యానెల్ ఈ సంఖ్యలను జాతీయ అసెంబ్లీలో విడుదల చేసింది. గతేడాది సౌదీ అరేబియా పాకిస్తాన్ యాచకులను పవిత్ర నగరాలైన మక్కా, మదీనాల్లో భిక్షాటన చేయకుండా ఉమ్రా వీసాల దుర్వినియోగాన్ని ఆపాలని కోరింది.
చాలా కాలంగా, హజ్, ఉమ్రా వీసాలను దుర్వినియోగం చేస్తూ చాలా మంది పాకిస్తానీ యాచకులు మక్కా, మదీనాల్లో అడుక్కుంటున్నారు. అక్రమ వలసలు, భిక్షాటన బృందాలు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయని పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ భద్రతా సంస్థ, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) చీఫ్ రిఫత్ ముఖ్తార్ అన్నారు. ఈ పరిస్థితిని నియంత్రణలోకి రాకుంటే, పాకిస్తానీలు హజ్, ఉమ్రా వెళ్లే వారిపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. పశ్చిమాసియాలో నిర్బంధించబడిన యాచకుల్లో 90 శాతం మంది పాకిస్తాన్‌కు చెందిన వారే అని 2024లో విదేశీ పాకిస్తానీ కార్యదర్శి జీషన్ ఖాన్జాదా అన్నారు.
తాజావార్తలు
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!