Saudi Arabia: వీసా ఆంక్షలు, నో-ఫ్లై జాబితాలు, విదేశాల బహిష్కరణలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్లు మాత్రం యథేచ్చగా విదేశాల్లో భిక్షాటన చేస్తూనే ఉన్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, అజన్ బైజాన్ దేశాల్లో పాకిస్తాన్ బిచ్చగాళ్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయా దేశాలు దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద తమ ఆందోళనల్ని వ్యక్తపరుస్తోంది.