Site icon NTV Telugu

Saudi Arabia: 56,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా..

Saudi Arabia

Saudi Arabia

Saudi Arabia: వీసా ఆంక్షలు, నో-ఫ్లై జాబితాలు, విదేశాల బహిష్కరణలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్లు మాత్రం యథేచ్చగా విదేశాల్లో భిక్షాటన చేస్తూనే ఉన్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, అజన్ బైజాన్ దేశాల్లో పాకిస్తాన్ బిచ్చగాళ్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయా దేశాలు దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద తమ ఆందోళనల్ని వ్యక్తపరుస్తోంది. పాకిస్తాన్‌ను బిచ్చగాళ్ల ఎగుమతిని ఆపేయాలని హెచ్చరిస్తున్నాయి. మక్కా, మదీనా వంటి ఇస్లాం పవిత్ర స్థలాలు ఉన్న సౌదీ అరేబియా ఇటీవల తన దేశం నుంచి 56,000 మంది పాకిస్తానీయులను బహిష్కరించింది. ఈ వ్యవస్థీకృత ముఠాలు విదేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2025లో 66,154 మంది ప్రయాణికులను జాబితాను సిద్ధం చేసింది.

Read Also: PM Modi: ప్రధాని మోడీకి ఒమన్ అత్యున్నత పురస్కారం.. ‘‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’’ ప్రదానం..

గత నెలలో, తమ దేశంలో నేర కార్యకలాపాలకు పాల్పడటం, భిక్షాటన చేస్తున్నారనే ఆందోళన నేపథ్యంలో యూఏఈ చాలా మంది పాకిస్తానీలకు వీసాలను ఆపేసింది. పాకిస్తాన్ వేలాది మంది పౌరులను ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ (ECL) లేదా నో-ఫ్లై జాబితాలో ఉంచిన నెలల తర్వాత పాకిస్తాన్ పార్లమెంటరీ ప్యానెల్ ఈ సంఖ్యలను జాతీయ అసెంబ్లీలో విడుదల చేసింది. గతేడాది సౌదీ అరేబియా పాకిస్తాన్ యాచకులను పవిత్ర నగరాలైన మక్కా, మదీనాల్లో భిక్షాటన చేయకుండా ఉమ్రా వీసాల దుర్వినియోగాన్ని ఆపాలని కోరింది.

చాలా కాలంగా, హజ్, ఉమ్రా వీసాలను దుర్వినియోగం చేస్తూ చాలా మంది పాకిస్తానీ యాచకులు మక్కా, మదీనాల్లో అడుక్కుంటున్నారు. అక్రమ వలసలు, భిక్షాటన బృందాలు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయని పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ భద్రతా సంస్థ, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) చీఫ్ రిఫత్ ముఖ్తార్ అన్నారు. ఈ పరిస్థితిని నియంత్రణలోకి రాకుంటే, పాకిస్తానీలు హజ్, ఉమ్రా వెళ్లే వారిపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. పశ్చిమాసియాలో నిర్బంధించబడిన యాచకుల్లో 90 శాతం మంది పాకిస్తాన్‌కు చెందిన వారే అని 2024లో విదేశీ పాకిస్తానీ కార్యదర్శి జీషన్ ఖాన్జాదా అన్నారు.

Exit mobile version