NTV Telugu Site icon

Samsung: 55 ఏళ్ల చరిత్రలో అతి పెద్ద సమ్మెకు పిలుపునిచ్చిన శాంసంగ్ వర్కర్స్

Sumsung

Sumsung

Samsung workers strike: సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలోనే అతి పెద్ద సమ్మెను ఎదుర్కొంటుంది. దేశంలోనే అతి పెద్ద యూనియన్ అయిన శాంసంగ్ వర్కర్ల యూనియన్ నేటి నుంచి మూడు రోజుల పాటు కంపెనీ నుంచి వాకౌట్‌ చేసింది. జీతం పెంపు, సెలవుల సమయంపై గత నెలలో జరిగిన చర్చలు ఫెయిల్ కావడంతో యూనియన్ నేతలు సమ్మెకు పిలుపునిచ్చింది. కాగా, శాంసంగ్ అర్థ శతాబ్దపు చరిత్రలో ఈ స్థాయిలో సమ్మెకు వెళ్లడం ఇదే మొదటిసారి అని ఆ కంపెనీ అధినేత పేర్కొన్నారు.

Read Also: Disqualification MLAs: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌.. నేడు హైకోర్టులో విచారణ..

అయితే, అత్యంత అధునాతన చిప్‌లు తయారు చేసే వాటిలో ఒకటైన ఇక్కడి ప్లాంట్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగించడమే ఈ సమ్మె యొక్క ప్రధాన లక్ష్యమని యూనియన్ నాయకులు చెప్పుకొచ్చారు. రాజధాని సియోల్‌కు 38 కిలో మీటర్ల దూరంలో ఉన్న హ్వాసోంగ్‌లోని సెమీ కండక్టర్ ప్లాంట్ల బయట దాదాపు 5 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించాలని యూనియన్ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఈ ర్యాలీకి ఎంత మంది హాజరవుతారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లీ హ్యున్- కుక్ ప్రకటించారు. ఈ సమ్మె కారణంగా శాంసంగ్ పేరు ప్రతిష్ఠలు పూర్తిగా దెబ్బతినే ఛాన్స్ ఉంది.