Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News S Jaishankar Meets Saudi Crown Prince And Hands Over Pm Modis Written Message

Saudi Arabia: సౌదీ యువరాజును కలిసిన విదేశాంగమంత్రి.. ప్రధాని మోడీ రాతపూర్వక సందేశం అందజేత

Published Date :September 12, 2022 , 10:45 am
By Mahesh Jakki
Saudi Arabia: సౌదీ యువరాజును కలిసిన విదేశాంగమంత్రి.. ప్రధాని మోడీ రాతపూర్వక సందేశం అందజేత
  • Follow Us :
  • google news
  • dailyhunt

Saudi Arabia: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో సమావేశమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి రాతపూర్వక సందేశాన్ని అందజేశారు. దీంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఆయనకు వివరించారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించేందుకు జైశంకర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం సౌదీ అరేబియా చేరుకున్నారు. విదేశాంగ మంత్రిగా సౌదీ అరేబియాకు రావడం ఇదే తొలిసారి.

ఆదివారం జెడ్డాలో సౌదీ యువరాజును కలిశారు.ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ప్రధాని మోడీ నుంచి లిఖితపూర్వక సందేశాన్ని అందుకున్నారని సౌదీ అధికారిక ప్రెస్ ఏజెన్సీ నివేదించింది. జెడ్డాలోని యువరాజు కార్యాలయంలో జరిగిన సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ యువరాజును కలిసి లిఖితపూర్వక సందేశాన్ని అందజేసినట్లు అది తెలిపింది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని పెంపొందించుకునేందుకు ఉన్న అవకాశాలపై సమీక్షించారని, తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు వాటి కోసం చేస్తున్న ప్రయత్నాలపై చర్చించారని పేర్కొంది.

Ayodya Temple: అయోధ్య రామ మందిరం నిర్మాణానికి రూ. 1,800 కోట్లు

“ఈ సాయంత్రం జెడ్డాలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలియజేసారు. ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతి గురించి తెలియజేశారు. సంబంధాల గురించి ఆయన దృష్టి సారించినందుకుధన్యవాదాలు” అని జైశంకర్ సమావేశం అనంతరం ట్వీట్ చేశారు. అంతకు ముందు రియాద్‌లో సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్‌తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమస్యలపై చర్చించారు. G-20, బహుపాక్షిక సంస్థలలో కలిసి పనిచేయడానికి అంగీకరించారు. భారతదేశం,సౌదీ అరేబియా శతాబ్దాల నాటి ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తూ సత్సంబంధాలు, స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయి. సౌదీ అరేబియా భారత్‌కు నాల్గవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • foreign minister s.jaishankar
  • india
  • PM Narendra Modi
  • saudi arabia
  • Saudi Crown Prince

తాజావార్తలు

  • Rain Alert: ఈ మూడు రోజులు అలర్ట్.. ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్ష సూచనలు..

  • Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం

  • AA 22 : అల్లు అర్జున్ టైటిల్ అనౌన్స్మెంట్ కు టైమ్ ఫిక్స్

  • IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీఎల్

  • MLA Arava Sridhar: తన ప్రైవేట్‌ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions