NASA: దాదాపుగా 40 ఏళ్ల తరువాత రష్యా చంద్రుడిపైకి లూనా-25 అంతరిక్ష నౌకను పంపింది. అన్ని అనుకున్నట్లు జరిగిే చంద్రయాన్-3 కన్నా ముందే లూనా-25 చంద్రుడి దక్షిణ ధృవంపై దిగి చరిత్ర సృష్టించేది. అయితే చంద్రుడి కక్ష్యలోకి చేరిన తర్వాత లూనా-25 రష్యాతో సంబంధాలు కోల్పోయింది. చివరకు చంద్రుడిపై కుప్పకూలింది.
సంబంధాలు తెగిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తోంది రష్యా అంతరిక్ష సంస్థ. అయితే తాజాగా లూనా-25 కుప్పకూలిన ప్రాంతాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేసింది. 47 ఏళ్ల తర్వాత రష్యా తొలి మూన్ మిషన్ లూనా-25 ఆగస్టు 19న విఫలమైంది. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా లూనా-25లోని ఇంజన్లు మండకపోవడం వల్లే క్రాష్ జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
తాజాగా నాసా విడుదల చేసిన ఫోటోల్లో చంద్రుడిపై దాదాపుగా 10 మీటర్ల వెడల్పుతో బిలం ఏర్పడింది. ఇది లూనా-25 కూలిపోవడం వల్లే ఏర్పడినట్లు తెలుస్తోంది. దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ కి సిద్ధమవుతున్న తరుణంలో ఈ స్పేస్ క్రాఫ్ట్ కూలిపోయింది.
Read Also: Manipur Violence: కోమ్ కమ్యూనిటీకి భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రికి మేరీకోమ్ లేఖ
చంద్రుడి చుట్టూ తిరుగుతున్న అమెరికా నాసాకు చెందిన వ్యోమనౌక లూనార్ రికనేసెన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్ఓ) చందమామా ఉపరితలంపై కొత్త బిలాన్ని గుర్తించింది. ఇది రష్యా లూనా-25 మిషన్ కూలిన ప్రదేశమే అని గుర్తించింది. ఈ బిలం లూనా ఇంపాక్ట్ పాయింట్ కు దగ్గర ఉందని, ఇది సహజమైన తాకిడిగా లేదని, ఇది కూలిపోవడం వల్లే ఏర్పడినట్లు నిర్థారించింది.
క్రాష్ తర్వాత, లూనా-25 క్రాఫ్ట్ కోల్పోవడానికి గల కారణాలను పరిశోధించడానికి ప్రత్యేక ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు రష్యా తెలిపింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత రష్యా స్పేస్ ప్రోగ్రాం క్రమంగా మసకబారింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికాకు ధీటుగా స్పేస్ పవర్ గా ఉన్న సోవియట్ యూనియన్ ప్రస్తుతం ఆ కీర్తిని కోల్పోయింది.