Site icon NTV Telugu

Ukraine Russia War: అమ్మాయిలపైనే కాదు.. బాలురపై అత్యాచారాలు..!

Ukraine Russia War

Ukraine Russia War

ఉక్రెయిన్‌పై 70 రోజులుగా…యుద్ధం చేస్తున్న రష్యా…ఎంతో మందిని చంపేసింది. మరెందర్నో నిరాశ్రయులుగా మార్చేసింది. వేలాది ఇళ్లను నేలమట్టం చేసింది. ఇక్కడితో అగని రష్యా సైన్యం… సమాజం సిగ్గుపడే దారుణాలకు ఒడిగడుతోంది. ఎవరేమనుకుంటే…మాకేంటి అనేలా వ్యవహరిస్తోంది. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా… రష్యా సైన్యం మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నాయ్. కేవలం మహిళలనే కాకుండా పురుషులు, బాలురపైనా రష్యా సైనికులు అత్యాచారాలు చేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి విచారణలో వెల్లడైంది. వీటికి సంబంధించి ఇప్పటికే డజనుకుపైగా కేసులను గుర్తించింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌ పౌరులను భయభ్రాంతులకు గురిచేయడానికి…శత్రబలగాలు అస్త్రంగా వాడుకుంటున్నాయి.

Read Also: KTR: చేతనైతే ఆ పని చేయి.. బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్

గ్యాంగ్‌రేప్‌లు, కుటుంబ సభ్యులముందే లైంగిక దాడుల వంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. మహిళలపై లెక్కు మించి అత్యాచారాలు జరుగుతున్నా.. ఆ దారుణాన్ని చెప్పుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఇక పురుషుల విషయానికి వస్తే ఇది మరింత కష్టంగా ఉంటుంది. లైంగిక హింస కేసులను గుర్తించడానికి బాధితులందరికీ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇలాంటి కేసులపై దర్యాప్తు ప్రారంభించింది. దోషులను గుర్తించి వారిని అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టేందుకు బాధితులు ముందుకు రావాల్సి ఉంది.

శత్రుదేశాల యుద్ధవిమానాలు సరిహద్దులు దాటి చొరబడకుండా… ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు పహారా కాస్తుంటాయి. ఈ వ్యవస్థలు ఎక్కడ అమర్చారన్నది రహస్యంగా ఉంచుతారు. వీటిని గుర్తించేందుకు ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లను ఎరలుగా వాడుతున్నారు. నల్ల సముద్రంలో మునిగిపోయిన మాస్కోవా యుద్ధనౌకలోని… గగనతల రక్షణ వ్యవస్థను ఈ డ్రోన్లే తప్పుదోవ పట్టించినట్లు నిపుణులు చెబుతున్నారు. మాస్కోవా సమీపం నుంచి ఉక్రెయిన్‌ టీబీ-2 డ్రోన్లు ఎగిరేట్లు చేసింది. మాస్కోవా ఎయిర్‌ డిఫెన్స్‌ దృష్టి… వీటిపై ఉన్న సమయంలో నెప్ట్యూన్‌ క్షిపణులను ప్రయోగించి ఆ యుద్ధనౌకను ధ్వంసం చేసింది. టీబీ-2 మొబైల్‌ గ్రౌండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఈ డ్రోన్లను అత్యధికంగా 300 కిమీ వరకు ఆపరేట్‌ చేయగలదు. తాజాగా రష్యాకు చెందిన రెండు రాప్టర్‌ శ్రేణి గస్తీ నౌకలను టీబీ-2 డ్రోన్లు ముంచేశాయి. రష్యా కాన్వాయిలను ఈ డ్రోన్లు కకావికలం చేశాయి.

Exit mobile version