NTV Telugu Site icon

Putin Warning: జర్మనీ, ఫ్రాన్స్ లకు రష్యా ప్రెసిడెంట్ వార్నింగ్

Putin

Putin

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం అయి దాదాపుగా మూడు నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. బలమైన రష్యా ముందు కేవలం వారాల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ రష్యాకు ఎదురొడ్డి పోరాడుతోంది. అయితే అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ కు సైనికంగా, వ్యూహాత్మకంగా సాయపడటంతో ఉక్రెయిన్ ఆర్మీ ఎదురునిలిచి పోరాడుతోంది.

ఇదిలా ఉంటే జర్మనీ, ఫ్రాన్స్ కూడా ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా చేయడానికి సిద్ధం అయ్యాయి. అయితే రష్యా ఈ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తోంది. ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇవ్వవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ శనివారం ఇరు దేశాలను హెచ్చరించారు. ఇది ఉక్రెయిన్ లోని పరిస్థితిని మరింత అస్థిరపరిచే చర్యగా అభివర్ణించాడు. ఉక్రెయిన్ కు కొనసాగుతున్న ఆయుధ సరఫరా ప్రమాదకరం అని పుతిన్ ప్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ లకు చెప్పార. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్న పరిస్థితిని, మానవతా సంక్షోభాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉందని హెచ్చరించాడు.

ఇదిలా ఉంటే స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు ఇటీవల జరుగుతున్న పరిణామాలతో తమ రక్షణకు నాటో కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఈ చర్య రష్యాకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. తమ మాట వినక నాటోలో చేరాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయినా కూడా రష్యా హెచ్చరికలను లెక్క చేయకుండా ఈ రెండు దేశాలు నాటోలో చేరేందుకు దరఖాస్తు కూడా చేశాయి.

అయితే యుద్ధానికి అసలు కారణం ఉక్రెయిన్ నాటోలో చేరుతామని ప్రయత్నాలు ప్రారంభించడమే. గతంలో సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ అమెరికా సారథ్యంలోని నాటోలో చేరితే తమ ఉనికికే ప్రమాదం అని భావించిన రష్యా యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఉక్రెయిన్ దాదాపుగా నాశనం అయ్యేంత వరకు రష్యా యుద్ధాన్ని ఆపకపోవచ్చు.