వియత్నాం అధ్యక్షుడిని కలవనున్న పుతిన్‌

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మంగళవారం వియత్నాం అధ్యక్షుడు న్గుయెన్‌ జువాన్‌ ఫుక్‌ను కలవనున్నారు. ఆయన న్గుయెన్‌ని కలిసి సైనిక సహకారం, ఆర్థిక వ్యవస్థపై చర్చించనున్నారని రష్యా అధ్యక్ష కార్యాలయం సోమవారం వెల్లడించింది. నవంబర్‌ 30న వియత్నాం అధ్యక్షుడికి మాస్కో ఆతిథ్యం ఇవ్వనుంది.

ఈ చర్చల్లో ఇరువురి అధ్యక్షులు.. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే వాణిజ్యం, సైనిక – శాస్త్రీయ రంగాల సాంకేతిక సహకారం, కొత్తగా వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు – రెండు దేశాల భాగస్వామ్యంతో పాటు ప్రాంతీయ ఎజెండాలపై చర్చించనున్నారని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.