NTV Telugu Site icon

Make Love Not War: రష్యా వరుడు.. ఉక్రెయిన్ వధువు.. భారత్‌లో పెళ్లి..!!

Marriage

Marriage

Make Love Not War: ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర స్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే కాదు ఓ జంట ప్రేమ కూడా నడిపిస్తోంది. రష్యాలో జన్మించిన వ్యక్తి, ఉక్రెయిన్‌లో జన్మించిన మహిళ ప్రేమించుకుని భారత్‌లో ఒక్కటయ్యారు. ఆగస్టు 2న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ 5న తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఈ విషయం బహిర్గతమైంది.

వివరాల్లోకి వెళ్తే.. 28 ఏళ్ల ఉక్రెయిన్ మహిళ అలోనా బర్మాకా, రష్యాలో జన్మించిన 37 ఏళ్ల సెర్గీ నోవికోవ్ (ప్రస్తుతం ఇజ్రాయెల్ పౌరుడు)ఇజ్రాయెల్‌లో కలుసుకున్నారు. అనంతరం మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. అయితే వీళ్లకు హిందూ సంప్రదాయం అంటే ఇష్టం కావడంతో భారతదేశానికి వచ్చి ఇక్కడి ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ధర్మశాలలో తమ వివాహం సందర్భంగా ‘యుద్ధం కాకుండా ప్రేమించండి’ అంటూ తమ రెండు దేశాలను కోరారు.

Read Also: Odisha: చీమల భయంతో గ్రామాలు వదులుతున్న ప్రజలు.. “రాణి చీమ” లక్ష్యంగా అధికారుల ఆపరేషన్

తాము ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నామని.. ఒక సంవత్సరం క్రితం భారతదేశానికి వచ్చి హిందూ సంప్రదాయం, సంస్కృతి ప్రకారం వివాహం చేసుకోవడానికి ప్రత్యేక ప్రదేశం ధర్మశాల అని భావించామని.. అందుకే ఇక్కడ వివాహం చేసుకున్నట్లు నోవికోవ్-బర్మాకా జంట వెల్లడించింది. తమ వివాహం రష్యా, ఉక్రెయిన్‌లకు మాత్రమే కాదు.. ఇక్కడి హిందూ ప్రజలకు కూడా సందేశమని చెప్పారు. ఒకప్పుడు రష్యా, ఉక్రెయిన్ సోదరుల తరహాలో ఉండేవని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడం విచారకరమన్నారు. హింస మంచిది కాదని.. ఒకరినొకరు ప్రేమించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ప్రజల మధ్య కాదని.. కేవలం ప్రభుత్వాల మధ్యే అని.. దీనిని ఆపగల శక్తి ఇరుదేశాల ప్రజలకు మాత్రమే ఉందని వరుడు సెర్గీ నోవికోవ్ పిలుపునిచ్చాడు.

Show comments