Site icon NTV Telugu

Russia-Ukrain: ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 14 మంది మృతి

Russiaukrain

Russiaukrain

ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు జరుగుతుండగా.. ఇంకోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య కూడా వార్ ఉధృతం అవుతోంది. తాజాగా కీవ్‌పై రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. బహుళ అంతస్థుపై డ్రోన్‌ను ప్రయోగించగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రగాయాలు పాలయ్యారు.

ఇది కూడా చదవండి: AP Liquor Scam Case: సిట్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.. ఏపీ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సంచలన లేఖ!

కీవ్‌లో డజన్లకొద్దీ అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ సైనిక అధికారి తెలిపారు. భవనాల శిథిలాల కింద అనేకమంది ప్రజలు చిక్కుకున్నారని.. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘటనా స్థలాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ దాడిలో అమెరికా పౌరుడు కూడా మరణించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. కెనడా జీ7 సదస్సులో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Haryana Model Murder Case: వీడిన మోడల్ మర్డర్ మిస్టరీ.. చంపిందెవరంటే..!

ఓ వైపు రష్యా-ఉక్రెయిన్ చర్చలు జరుగుతుండగానే ఇరు పక్షాలు దాడులకు దిగుతున్నాయి. ఇటీవల ఇస్తాంబుల్ వేదికగా జరిగిన చర్చల తర్వాత ఇరు పక్షాల యుద్ధ ఖైదీలను విడుదల చేసుకున్నాయి. ఇంకా చర్చలు జరుగుతుండగానే తాజాగా రష్యా దాడులకు పాల్పడింది.

జీ 7 సదసులో భాగంగా జెలెన్‌స్కీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కావాల్సి ఉంది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అర్ధాంతరంగా ట్రంప్ అమెరికా వెళ్లిపోయారు. భద్రతా మండలి సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

 

Exit mobile version