Site icon NTV Telugu

Russia: ఇజ్రాయిల్-ఇరాన్ వివాదంలో మీ జోక్యం వద్దు.. యూఎస్‌కి రష్యా వార్నింగ్..

Putin

Putin

Russia: ఇజ్రాయిల్ ఇరాన్ సంఘర్షణ నేపథ్యంలో రష్యా అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వివాదంలో యూఎస్ సైనిక జోక్యం చేసుకోకూడదని హెచ్చరించింది. ‘‘ ఈ పరిస్థితిలో సైనిక జోక్యం ఉండకూడదు. ఇది నిజంగా అనూహ్యమైన, ప్రతికూల పరిణామాలతో కూడిన అత్యంత ప్రమాదకర చర్య అవుతుంది’’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు.

Read Also: Viral Video: పెళ్లిమండపం పైనే కాబోయేవాడికి ముద్దుల వర్షం కురిపించిన పెళ్లి కూతురు..!

బుషెహర్ అణు కర్మాగారంపై వైమానిక దాడులను నిలిపివేయాలని మాస్కో ఇజ్రాయెల్‌ను కోరింది. ఆ ప్రాంతంలో రష్యన్ నిపుణులు పనిచేస్తున్నారని చెప్పింది. బుషెహర్ ఇరాన్ లో ఉన్న ఏకైక అణు విద్యుత్ కేంద్రం. ఇదిలా ఉంటే, బుధవారం రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ ఇజ్రాయెల్‌కు ప్రత్యక్ష సైనిక సహాయం అందించకుండా అమెరికాను హెచ్చరించారు. ఇది మొత్తం పరిస్థితిని అస్థిర పరుస్తుందని అన్నారు.

Exit mobile version