Site icon NTV Telugu

America: సైనికులను నియమించుకోవడానికి రష్యా కష్టపడుతోంది..

America

America

America: ఉక్రెయిన్‌తో పోరాడేందుకు ఎక్కువ మంది సైనికులను నియమించుకోవడానికి రష్యా కష్టపడుతోందని యూఎస్ డిఫెన్స్ సీనియర్ అధికారి సోమవారం తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని 130,000 కంటే ఎక్కువ మంది సైనికులతో పెంచడానికి ఇటీవల చేసిన ప్రయత్నం విజయవంతం అవుతుందని యుఎస్ ప్రభుత్వం భావించడం లేదని డిఫెన్స్ అధికారి పేర్కొన్నారు. గత వారం, వచ్చే ఏడాది నుంచి రష్యా పోరాట సిబ్బందిని 1.9 మిలియన్ల నుండి 2.04 మిలియన్లకు పెంచడానికి పుతిన్ ఒక డిక్రీపై సంతకం చేశారు. రష్యా నియామక లక్ష్యాలను చేరుకోలేదని యూఎస్ అధికారి పేర్కొన్నారు.

Gautam Adani: ప్రపంచ కుబేరుల జాబితా.. మూడో స్థానానికి ఎగబాకిన అదానీ.. టాప్‌ 10లో లేని అంబానీ

రష్యన్ వైపు రిక్రూట్ అయిన చాలా మంది వృద్ధులు, అనర్హులు, అనారోగ్యంతో ఉన్న వారు కూడా శిక్షణ పొందారని తెలిపారు. దీనిని బట్టి గమనిస్తే సంవత్సరాంతం వరకు కొద్ది మేరకు నియామకాలు జరగొచ్చని ఆ అధికారి చెప్పుకొచ్చారు. మరోవైపు అమెరికా రక్షణ శాఖ సముద్ర మార్గంలో ఉక్రెయిన్‌కు ఆయుధాల రవాణాను ప్రారంభించింది. ఓడలు విమానం కంటే నెమ్మదిగా ఉన్నప్పటికీ, పెద్ద మొత్తంలో సరుకును రవాణా చేయగలవు. అంతకుముందు, యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్ కోసం 2.98 బిలియన్ అమెరికా డాలర్ల సైనిక సహాయాన్ని ప్రకటించింది. ఇందులో అమెరికా రక్షణకు సాయంగా ఆరు అదనపు నేషనల్ అడ్వాన్స్‌డ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ (NASAMS) ఉన్నాయి. ఉక్రెయిన్‌కు మునుపటి భద్రతా ప్యాకేజీలలో చాలా వరకు ప్రెసిడెన్షియల్ డ్రాడౌన్ ప్యాకేజీలు, అమెరికా జాతీయ రక్షణ నిల్వల నుండి ఆయుధాలు, సామగ్రిని పంపించింది.

Exit mobile version