NTV Telugu Site icon

Ukraine Crisis: లిసిచాన్స్క్‌ను స్వాధీనం చేసుకున్నాం.. రష్యా రక్షణ శాఖ ప్రకటన

Ukraine Crisis

Ukraine Crisis

గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా క్షిపణులతో దాడులు చేస్తుండగా.. పలు దేశాలు అందించిన ఆయుధాలతో ఉక్రెయిన్ మాస్కో సేనలను ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌లో కీలకమైన డాన్‌బాస్ ప్రాంతం పట్టు సాధించినట్లు రష్యా ప్రకటించింది. లూహాన్స్క్ ప్రాంతంలోని లిసిచాన్స్క్ నగరాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో శత్రువును పూర్తి స్థాయిలో తరిమి కొట్టి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.

North Korea: గ్రహాంతరవాసుల వల్లే కరోనా వ్యాప్తి.. కిమ్ షాకింగ్ కామెంట్స్

లిసిచాన్స్క్ నగరం చుట్టూ ఉన్న గ్రామాలను కూడా పూర్తిగా మోహరించి మొత్తంగా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంత నగరమైన ఖార్కీవ్‌లో ఉక్రెయిన్ మిలటరీ స్థావరంపై దాడి చేశామని.. ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని మైకోలేవ్ నగర శివార్లలో ఉన్న విదేశీ విమానాల స్థావరాన్నీ నేలమట్టం చేశామని ప్రకటించింది. రష్యాకు సరిహద్దుగా ఉన్న ఉక్రెయిన్ ప్రాంతం డాన్‌బాస్‌ను పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా మొదటి నుంచీ ప్రయత్నిస్తోంది. డాన్‌బాస్‌లోని లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అక్కడ ఇప్పటికే రష్యా మద్దతుతో వేర్పాటు వాదులు ఉక్రెయిన్ ప్రభుత్వ దళాలపై పోరాడుతున్నారు. వారితోపాటు రష్యా కూడా పెద్ద సంఖ్యలో దళాలతో కలిసి కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటోంది.