NTV Telugu Site icon

Queen Elizabeth Funeral: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు ఈ దేశాలకు ఆహ్వానం లేదు.

Queen Elizabeth Funeral

Queen Elizabeth Funeral

Russia, Myanmar, Belarus Not Invited For Queen’s Funeral:యూకే రాణి ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న స్కాట్లాండ్ లోని బల్మోరల్ కాజిల్ లో మరణించారు. ఆమె మరణం పట్ల ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. వివిధ దేశాధినేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. వచ్చే సోమవారం క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు జరగనున్నాయి. సెప్టెంబర్ 19న జరగనున్న క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు వివిధ దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. అయితే మూడు దేశాలను మాత్రం బ్రిటన్ ఆహ్వానించలేదని వైట్ వైట్‌హాల్ వర్గాలు మంగళవారం తెలిపాయి.

రష్యా, బెలారస్, మయన్మార్ దేశాలను బ్రిటన్ ఆహ్వానించలేదు. ఉక్రెయిన్ పై దాడి తర్వాత నుంచి రష్యాను పాశ్చాత్య ప్రపంచం నుంచి ఏకాకిని చేయాలని బ్రిటన్, యూఎస్ఏతో పాటు నాటో కూటమి, పాశ్చత్య దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై వివిధ ఆంక్షలను విధించాయి. అయితే ఆంక్షలను ధిక్కరించి కూడా రష్యా.. పాశ్చాత్య దేశాలకు లొంగలేదు. దీంతో పాటు రష్యా అత్యంత మిత్ర దేశం అయిన బెలారస్ ను కూడా బ్రిటన్ ఆహ్వానించలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి బెలారస్, రష్యాకు అండగా నిలుస్తోంది.

Read Also: Bandi Sanjay : అధికార పార్టీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి

ఇక ఆగ్నేయాసియా దేశం అయిన మయన్మార్ అక్కడి ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి.. దేశాధినేతగా ఉన్న ఆంగ్ సాంగ్ సూచీని నిర్భంధించింది. దేశంలో మిలిటరీ పాలనను తీసుకువచ్చింది. అక్కడి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని నిరసనలు, ఆందోళనలు చేపడితే అత్యంత క్రూరంగా అణచివేసింది. చాలా మందిని చంపేసింది. ఇక రోహింగ్యా ముస్లింపై జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా అప్పట్లో బ్రిటన్ తన గళాన్ని వినిపించింది. దీంతో రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు ఈ మూడు దేశాలను బ్రిటన్ ఆహ్వానించలేదు.

లండన్‌లో జరిగే క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు దాదాపు 500 మంది విదేశీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని, బ్రిటన్‌తో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న చాలా దేశాల అధినేతలకు ఆహ్వానాలు పంపినట్లు బీబీసీ తెలిపింది. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తో సహా ఫస్ట్ లేడీ జిల్ బిడెన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ ప్రధాన మంత్రులతో పాటు ప్రపంచ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.