NTV Telugu Site icon

Russia: రష్యా కీలక నిర్ణయం.. 2025లో వాట్సాప్‌ నిషేధం!

Whatsapp

Whatsapp

రష్యా మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2025 కొత్త సంవత్సరంలో వాట్సాప్‌పై నిషేధం విధించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సంకేతాలు వెలువడ్డాయి. విదేశీ యాప్‌లు రష్యన్ చట్టాలకు లోబడి ఉండకపోతే నిషేధం విధిస్తామని రష్యన్ అధికారులు హెచ్చరించారు. కీలక సమాచారాన్ని భద్రతా సిబ్బందితో పంచుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Ramtek bungalow: ‘‘రామ్‌టెక్ బంగ్లా’’ పేరు వింటేనే ‘మహా’ మంత్రులకు భయం.. కారణాలేంటి..?

రష్యా సెనేటర్ ఆర్టియోమ్ షేకిన్, డుమా అధికారి ఒలేగ్ మాట్వేచెవ్ మాట్లాడుతూ… ఇప్పుడు బంతి వాట్సాప్ కోర్టులో ఉందని, రష్యన్ నిబంధనలు పాటించాలా లేదా నిష్క్రమించాలా ? అనేది వారికే వదిలేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని భద్రతా సేవలతో యూజర్ సమాచారాన్ని ప్లాట్‌ఫామ్ పంచుకోకపోతే.. వచ్చే ఏడాది వాట్సాప్‌ను బ్లాక్ చేయగలదని సెనేటర్ ఆర్టెమ్ షీకిన్ రాష్ట్ర వార్తా సంస్థ ఆర్‌ఐఏ నోవోస్టితో అన్నారు. ‘‘విదేశీ కంపెనీలు చట్టాన్ని పాటించాలి, లేకుంటే వాటి పని అసాధ్యం’’ అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే మెటా యాజమాన్యంలోని యాప్‌లు ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ 2022 నుంచే రష్యాలో నిషేధించబడ్డాయి. తాజాగా వాట్సాప్ పని కూడా అదే మాదిరి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Winter: చలికాలంలో బరువు తగ్గించే ఆహారాలు ఇవే!

Show comments