NTV Telugu Site icon

Putin-Trump: పుతిన్-ట్రంప్ భేటీపై రష్యా కీలక ప్రకటన

Putintrump

Putintrump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం అయ్యేందుకు అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అమెరికా స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. ఇద్దరి భేటీ ఎప్పుడు ఉంటుందన్న విషయం మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దావోస్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ట్రంప్‌ వర్చువల్‌గా మాట్లాడారు. అణ్వాయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Gold Price: పసిడి ప్రియులకు షాక్.. కొండెక్కిన ధరలు.. ఎంతంటే..!

ఉక్రెయిన్‌ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని తెలిపారు. చమురు ధరలు దిగివస్తే యుద్ధం మరింత వేగంగా ముగిసిపోతుందని చెప్పారు. అమెరికా-రష్యా సంబంధాలు ఉక్రెయిన్‌ యుద్ధంతో అత్యంత దారుణంగా క్షీణించాయి. రష్యాతో పోరాడుతున్న జెలెన్‌స్కీ సైన్యానికి మాజీ అధ్యక్షుడు బైడెన్‌ హయాంలో అమెరికా భారీ స్థాయిలో ఆయుధ సాయంతో పాటు ఆర్థికంగాను ఆదుకుంది. ప్రస్తుతం ట్రంప్ అధ్యక్షుడయ్యాడు. ఈ సారి పరిణామాలు మారవచ్చని తెలుస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Sewing Machines: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్లు!.. ఇలా అప్లై చేసుకోండి!