ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. డాన్‌బాస్ ప్రాంతంలోని మూడు కమాండ్ పాయింట్లతో పాటు సైనిక సామాగ్రి నిల్వ ఉన్న 13 స్థావరాలు, నాలుగు మందుగుండు డిపోలను ధ్వంసం చేసింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో మోహరించిన మొబైల్ యాంటీ-డ్రోన్ వ్యవస్థను రష్యా రాకెట్లు దెబ్బతీసినట్టు సమాచారం. ముఖ్యంగా ఉక్రెయిన్ సైనిక స్థావరాలే టార్గెట్‌గా రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. ఉక్రెయిన్‌లో ఉక్రెయిన్‌కు కోలుకోలేని దెబ్బ తగలిందని.. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు 174 యుద్ధ విమానాలు, 125 హెలికాప్టర్లు, 3వేల 198 ట్యాంకులను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. అటు 29 వేలకుపైగా రష్యన్ సైనికులను హతమార్చినట్లు తెలిపింది ఉక్రెయిన్ రక్షణశాఖ. 204 యుద్ధ విమానాలు, 170 హెలికాప్టర్లు, 1285 ట్యాంకులను నాశనం చేసినట్లు వెల్లడించింది.
Read Also: Lockdown: చైనాలో మళ్లీ కోవిడ్ విజృంభణ.. కీలక నగరాల్లో లాక్‌డౌన్..
ఇక, యుద్ధం నాలుగోనెలలోకి ప్రవేశిస్తున్నా ఇప్పటికీ విజేత ఎవరనేది తేలలేదు. పోరాడితే పోయేదేమీ లేదన్న తరహాలో ఉక్రెయిన్ వీలైనన్ని తంత్రాలతో దూకుడు ప్రదర్శిస్తుండగా.. రష్యా దీటుగానే బదులిస్తూ ఒక్కోనగరాన్ని వశం చేసుకుంటూ ముందుకెళ్తుంది. అయితే.. ఉక్రెయిన్ సైన్యాల గెరిల్లా యుద్దతంత్రం రష్యన్ బలగాలను బెంబేలెత్తిస్తోంది. ఉక్రెయిన్‌లో గెరిల్లా వార్‌ఫేర్ రష్యాకు సవాల్‌గా మారింది. అందుకే రష్యాకు ఉక్రెయిన్‌పై ఇప్పటి వరకు పట్టు దక్కలేదు.