Site icon NTV Telugu

Ruchira Kamboj: ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన రుచిరా కాంబోజ్

Ruchira Kamboj

Ruchira Kamboj

Ruchira Kamboj: ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్‌ అరుదైన ఘనత సాధించారు. ఐక్యరాజ్యసమితిశాశ్వత ప్రతినిధిగా సీనియర్ భారత రాయబారి 1987 ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారిణి రుచిరా కాంబోజ్‌ బాధ్యతలను స్వీకరించారు. భారత్‌ పక్షాన ఐరాసలో మొట్టమొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా బాధ్యతలు స్వీకరించారని యూఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుట్రెస్ ట్వీట్ చేశారు. మనదేశం నుంచి ఈ రికార్డు సాధించిన మొదటి మహిళ ఆమే కావడం విశేషం. ఈ జూన్‌లో ఆమె నియామకం ఖరారు కాగా.. దానికి సంబంధించి పత్రాలను మంగళవారం ఐరాస జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్‌కు సమర్పించారు. ఆ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రస్‌కు శాశ్వత ప్రతినిధిగా నా పత్రాలను సమర్పించాను. భారత్‌కు చెందిన ఒక మహిళకు తొలిసారి ఈ పదవి దక్కడం ఒక గొప్ప గౌరవం. మహిళలందరికీ నేను చెప్పేదొక్కటే.. మనం ఏదైనా సాధించగలం’ అని ఆమె బాధ్యతలు స్వీకరిస్తోన్న చిత్రాన్ని షేర్ చేశారు.

Tamilnadu: మద్యం మత్తులో ఉడుకుతున్న సాంబారులో పడిన వ్యక్తి.. వీడియో వైరల్

ఈ సందర్భంగా రుచిరా మనందరం సాధించగలం అని అమ్మాయిలకు సూచన చేశారు.రుచిరా గతంలో భుటాన్ దేశంలో భారత రాయబారిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితిలో ప్రతినిధిగా టీఎస్ తిరుమూర్తి స్థానంలో రుచిరా బాధ్యతలు చేపట్టారు. 1987లో ఇండియన్ ఫారిన్‌ సర్వీసెస్‌కు ఎంపికైన రుచిరా కాంబోజ్‌(58).. టీఎస్ తిరుమూర్తి స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది సివిల్‌ సర్వీసెస్‌లో మహిళా విభాగంలో ఆమె ఆలిండియా మొదటి ర్యాంకు, ఫారిన్ సర్వీసెస్ విభాగంలో కూడా మొదటి ర్యాంకు సాధించారు. ఈ తర్వాత పారిస్‌లో మొదట బాధ్యతలు స్వీకరించి, దౌత్యాధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ మన దౌత్యకార్యాలయంలో థర్డ్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. అనంతరం రుచిరా ఢిల్లీకి వచ్చి యూరప్ వెస్ట్ డివిజన్ విదేశీ వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం మారిషస్, దక్షిణాఫ్రికా, భూటాన్‌ సహా మరికొన్ని దేశాల్లో సేవలు అందించారు.

Exit mobile version