Site icon NTV Telugu

Colorado Attack: యూదు వ్యతిరేకుల వీసాలను రద్దు చేస్తాం.. అమెరికా హెచ్చరిక

Coloradoattack

Coloradoattack

కొలరాడో‌లోని బౌల్డర్‌లో ఆదివారం జరిగిన ఉగ్ర దాడిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించి వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఉగ్ర సానుభూతిపరులను గుర్తించి వారి వీసాను రద్దు చేసి.. దేశం నుంచి బహిష్కరిస్తామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి వీసాలు రద్దు చేయాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Operation Sindoor: ఆప్ సిందూర్‌పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ‘నో’ చెప్పిన కేంద్రం.!

గాజాలో బందీలకు మద్దతుగా యూదులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అయితే ఈజిప్ట్‌కు చెందిన మొహమ్మద్ సబ్రీ సోలిమాన్‌.. యూదులు లక్ష్యంగా సీసా బాంబులను విసిరాడు. మోలోటోవ్ కాక్‌టెయిల్స్‌ను ప్రయోగించాడు. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. 88 ఏళ్ల హోలోకాస్ట్ ప్రాణాలతో బయటపడింది. ఇద్దరు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక నిందితుడు సోలిమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Minister Anagani Satya Prasad: జగన్‌ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి..!

ఇక విచారణలో సోలిమాన్ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించాడు. తన బిడ్డ చదువు కోసం ఇన్నాళ్లు ఆగనని.. లేదంటే ఎప్పుడో యూదుల లక్ష్యంగా దాడులు చేయాలని అనుకున్నట్లు చెప్పాడు. తుపాకీతో కాల్చాలని అనుకున్నానని.. కాకపోతే అమెరికా పౌరుడును కాదు కాబట్టి తనకు గన్‌ లైసెన్స్ రాలేదని చెప్పుకొచ్చాడు. ఇక దాడి సమయంలో పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశాడు. పాలస్తీనాకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేశాడు.

వాస్తవానికి మొహమ్మద్ సబ్రీ సోలిమాన్‌ వీసా గడువు ముగిసింది. అయినా కూడా అక్రమంగా అమెరికాలో ఉంటున్నాడు. 2023, ఫిబ్రవరిలో బీ2 వీసాతో సందర్శన సాకుతో అమెరికా వచ్చాడు. దాని గడువు ముగిసింది. అయినా కూడా అక్రమంగా ఉంటున్నాడు. సోలిమాన్.. ఏడాది కాలంగా దాడి చేయడానికి కుట్ర పన్నినట్లుగా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ ఎక్స్‌లో తెలిపారు. దాడి చేశాక అతడు కూడా చనిపోవాలని ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించారు. ఒకవేళ అనుకున్నది చేయకపోతే తనను తాను క్షమించుకోనని చెప్పినట్లు పేర్కొన్నారు.

సోలిమాన్‌పై హత్యాయత్న అభియోగాలు మోపబడ్డాయి. దోషిగా తేలితే జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక ఇటీవల ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం దగ్గర ఇద్దరి అధికారులను దుండగుడు కాల్పులు జరిపి చంపేశాడు. ఈ నిందితుడు కూడా పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశాడు.

 

Exit mobile version