Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- టీఎంజెడ్ సంచలన కథనం
- అధికారికంగా ధృవీకరించని బాధిత కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు తీవ్ర మానసిక సంఘటర్షణకు గురైనట్లుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. 34 ఏళ్ల వయసులో అక్టోబర్ 12న టెక్సాస్‌లో ఆర్జే మిట్టే మరణించాడు. అయితే మరణానికి ముందు కాబోయే భార్య కెన్నెడీ సువారెజ్‌తో నెలకొన్న విభేదాలు కారణంగానే చనిపోయినట్లుగా టీఎంజెడ్ (TMZ) కథనం ప్రచురించింది.

Also Read
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
ఆర్జే మిట్టేకు తన తల్లి డైనా, సోదరి లాసియాన్తో ఉన్న రక్త సంబంధంపై ప్రియురాలు కెన్నెడీ సువారెజ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ‘తల్లి కావాలా? నేను కావాలా?’ అని ప్రేమికురాలు అల్టిమేటం విధించినట్లుగా పేర్లు వెల్లడించని వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనం పేర్కొంది. ఎటు తేల్చుకోలేకే మిట్టే ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఏర్పడిన వ్యక్తిగత విభేదాలే చావుకు కారణమని సమాచారం.

టీఎంజెడ్ కథనం ప్రకారం.. మిట్టే, కెన్నెడీ సువారెజ్ మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. తమ వ్యక్తిగత జీవితంలో మిట్టే తల్లి జోక్యం చేసుకుంటున్నారని కెన్నెడీ భావించినట్లు కథనం పేర్కొంది. తనకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరుకున్నట్లు పేర్లు వెల్లడించని వర్గాలు తెలిపినట్లు వార్త వెలువడింది. మరోవైపు మిట్టేకు తన తల్లి డైనా, సోదరి లాసియాన్తో మంచి అనుబంధం ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులకు దూరం కావడం ఆయనకు ఇష్టం లేదని, ఈ పరిస్థితి జంట మధ్య విభేదాలకు దారితీసి ఉండవచ్చని కథనం పేర్కొంది. అయితే ఈ కథనంపై మిట్టే కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు స్పందించలేదు.
పదేళ్ల స్నేహం.. ఆ తర్వాత ప్రేమ.. నిశ్చితార్థం
ఆర్జే మిట్టే, కెన్నెడీ సువారెజ్ దాదాపు పదేళ్లుగా స్నేహితులుగా ఉన్నారని, 2020లో ప్రేమలో పడినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత 2025 అక్టోబర్ 10న వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. మిట్టే మరణానికి వారం రోజుల ముందు వరకు ఇద్దరూ కలిసి ఉన్నారని టీఎంజెడ్ కథనం పేర్కొంది. అయితే చివరి రోజుల్లో ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనే విషయంపై అధికారిక సమాచారం లేదు.
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..