Site icon NTV Telugu

Rishi Sunak: మరోసారి వివాదంలో రిషి సునాక్.. ఈసారి “పెన్ను”పై వివాదం

Rishi Sunak

Rishi Sunak

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో కొన్ని వివాదాల్లో ఆయన ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ సారి ‘పెన్ను’ వివాదంలో రిషి సునాక్ చిక్కుకున్నారు. ఇప్పటికే అక్కడి ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టలేక రిషి సునాక్ విమర్శల పాలవుతున్నారు. ఆయన ఉపయోగిస్తున్న పెన్ను ఇప్పుడు వివాదాస్పదం అయింది. ఎరేజబుల్ ఇంక్‌తో ఉన్న పెన్నును రిషి సునాక్ వాడటం ప్రస్తుత వివాదానికి కారణమైంది.

బోరిక్ జాన్సన్ ప్రభుత్వంలో ఛాన్సలర్‌గా ఉన్నప్పటి నుంచి రిషి సునాక్ డిస్పోసబుల్ ‘పైలట్ వి’ పెన్నును వాడుతున్నారు. ఇప్పుడు ప్రధాని అయిన తర్వాత కూడా అధికారిక కార్యక్రమాల్లో కూడా ఇదే పెన్నును వినియోగిస్తునున్నారు. 15 రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో సునాక్ ఈ పెన్నుతో కనిపించారు. ఇటీవల మాల్డోవాలో జరిగి యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ సమావేశం సమయంలో అధికార పత్రాలపై ఇదే పెన్నుతో సంతకాలు చేశారు. దీంతో దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also: Sharad Pawar: కేసీఆర్ 600 కార్ల కాన్వాయ్‌తో మహారాష్ట్రకు రావడం ఆందోళకరం..

పైలట్ వి పెన్ను ఎరజబుల్ ఇంక్ కలిగి ఉంటుంది. దీంతో సంతకం చేసినా కూడా తుడిచేసే అవకాశం ఉంది. భద్రతాపరంగా వీటిని వాడటం మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంక్ పెన్నుతో రాయండం నేర్చునే వారు ఇలాంటి పెన్నులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.. వీటిలో ఏదైనా తప్పు రాస్తే ఇంక్ ఎరాడికేటర్స్ తో రాసినదాన్ని చెరిపేయొచ్చు. ప్రధాని బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిషిసునాక్ వంటి వ్యక్తి అధికార పత్రాల్లో ఈ పెన్నుతో సంతకం చేస్తే, దాన్ని చెరిపేసే అవకాశ ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ పెన్నులు వాడటం వల్ల రాజకీయ నాయకులపై ప్రజల విశ్వసనీయత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారుర. దీనిపై 10 డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు స్పందించాయి. ప్రధాని తనకు సంబంధించిన అన్ని పత్రాలను భద్రంగా ఉంచుతారని తెలిపాయి. సునాక్ మీడియా కార్యదర్శ మాట్లాడుతూ.. ఈ పెన్నును సివిల్ సర్వీస్ లో విరివిగా వాడుతారని.. ప్రధాని కూడా ఎప్పుడు ఈ పెన్నుతో తను చేసిన సంతకాలను, వ్యాఖ్యలను చెరిపేసే ప్రయత్నం చేయలేదని, భవిష్యత్తులో చేయరని తెలిపారు. ఈ పెన్ను ధర 4.75 పౌండ్లు. భారత కరెన్సీలో దాదాపుగా రూ. 495

Exit mobile version