Site icon NTV Telugu

Sri Lanka: ముస్లిం విద్యార్థుల ఫలితాలు నిలిపివేత.. కారణమేంటంటే..!

Higje

Higje

శ్రీలంకలో 70 మంది ముస్లిం విద్యార్థుల ఫలితాలను పరీక్షల విభాగం వారు నిలిపివేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హిజాబ్ కారణంగా ఫలితాలు నిలిపివేసినట్లు వెల్లడించింది. పరీక్ష సమయంలో చెవులకు హిజాబ్‌లు ధరించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ట్రింకోమలీలో ఉన్న కళాశాల నిబంధనల ప్రకారం.. పరీక్షల సమయంలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు విద్యార్థులు చెవులు మూసుకుపోకుండా చూసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా విద్యార్థులు హిజాబ్ ధరించి వచ్చారు. దీంతో ఫలితాలు ఆపేసింది. విచారణ తర్వాత విద్యార్థుల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ చర్యను ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు ఖండించాయి.

ఇది కూడా చదవండి: Mamata Banerjee: జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందే న్యాయవ్యవస్థకు సూచనలిచ్చిన మమతా బెనర్జీ..ఏమన్నారంటే?

మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ట్రింకోమలీలోని జహీరా కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థులు జనవరి 2024లో అడ్వాన్స్‌డ్ లెవెల్ (A/L) పరీక్షలకు హాజరయ్యారు. అయితే పరీక్ష రాసేటప్పుడు హిజాబ్ తీసేయాలి. కానీ వారు తీయకుండానే ఎగ్జామ్ రాశారు. దీంతో ఫలితాలను నిలిపివేశారు. విద్యార్థులు చెవుల్లో బ్లూటూత్ ఇయర్‌పీస్‌లు ధరించే అవకాశం ఉన్నందున ఈ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఫలితాలు నిలిపివేయడంతో తదుపరి తరగతులకు వెళ్లేందుకు ఆ విద్యార్థులకు అవకాశం లేకుండా పోయింది. దీంతో విద్యార్థులంతా లబోదిబో అంటున్నారు.

ఇది కూడా చదవండి: WhatsApp: వాట్సాప్‌లోకి ఏఐ.. మీరు ఇక ఏదైనా తెలుసుకోవచ్చు!

Exit mobile version