NTV Telugu Site icon

Putin: పుతిన్‌కి ఇద్దరు రహస్య కుమారులు.. విలాసవంతమైన ఒంటరి జీవితం..

Putin

Putin

Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీవితం ఎప్పుడూ రహస్యమే. తాజాగా ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారని తాజాగా ఓ నివేదిక చెప్పింది. వీరిద్దరి జీవితం పూర్తిగా ఒంటరిగా, రహస్యంగా, ఐశ్వర్యంలో పెరిగారని చెప్పుకొచ్చింది. పుతిన్ రహస్య కుమారుల పేర్లు ఇవార్, వ్లాదిమిర్ జూనియర్ అని, వారు విలాసవంతంగా, ఒంటరిగా జీవిస్తున్నారని బహిష్కరించబడిన రష్యా ప్రతిపక్ష నేత మికాయిల్ ఖోడోర్కోవ్‌స్కీ నేతృత్వంలోని పరిశోధన బృందం డోసియర్ సెంటర్ పేర్కొంది.

ఈ నివేదిక ప్రకారం.. వీరిద్దరిని రిటైర్డ్ జిమ్నాస్ట్, పుతిన్ ప్రేయసి అలీనా కబేవా పెంచుతున్నట్లు కథనం వెల్లడించింది. అలీనా కబేవాతో పుతిన్ చాలా ఏళ్లుగా సంబంధం కొనసాగిస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి. ఇవాన్ పుతిన్ స్విట్జర్లాండ్లోని లుగానోవలోని ఒక ప్రైవేట్ క్లీనిక్‌లో 2015 జన్మించగా, వ్లాదిమిర్ జూనియర్ 2019లో మాస్కోలో జన్మించినట్లు నివేదిక వెల్లడించింది. వీరిద్దరు మాస్కోకు వాయువ్యంగా ఉన్న వాల్దాయ్‌లోని ఒక విలాసవంతమైన ఎస్టేట్‌లో నివసిస్తున్నట్లు చెప్పింది.

Read Also: Sandip ghosh: సుప్రీంకోర్టులో ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్‌కు షాక్.. సీబీఐ దర్యాప్తుపై వేసిన పిటిపిన్ కొట్టివేత

కట్టుదిట్టమైన భద్రత, గోప్యత:

విలాసవంతమైన ఎస్టేట్‌లో ఉంటున్న వీరికి ట్యూటార్, నానీలు, స్పోర్ట్స్ కోచ్‌లు ఉన్నట్లు చెప్పింది. ఈ ఇద్దరు అబ్బాయిలు పూర్తిగా ప్రజల దృష్టి నుంచి దూరంగా ఉన్నారు. వారు శీతాకాలంలో సోచిలోని స్కీయింగ్, వేసవిలో రష్యన్ జలాల్లో పడవల్లో గడుపుతారని నివేదిక పేర్కొంది. పిల్లలు ప్రైవేట్ జెట్‌లు, సాయుధ రైళ్లు, హెలికాప్టర్‌లు, పడవల వంటి వాటిలో ప్రయాణించేటప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని చెప్పింది. వీరి ట్యూటర్లకు ఏకంగా నెలకు 8540 డాలర్ల గణనీయ వేతనం చెల్లించబడుతుందని చెప్పింది.

డోసియర్ నివేదిక ప్రకారం.. పుతిన్ తన కుమార్తెల కన్నా ఇద్దరు కుమారుల పట్ల ప్రత్యేకమైన గౌరవప్రదమైన వైఖరిని కలిగి ఉన్నట్లు తెలిపింది. తన కుమారులపై అధికారం చేయగల ఏకైక వ్యక్తి పుతిన్ మాత్రమే అని, వారి ప్రతీ కోరికను తీర్చగలరని నివేదిక పేర్కొంది.

Show comments