israel: ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్ సరికొత్త ఆయుధ సామర్థ్యాన్ని తొందరలోనే అమెరికాలో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఈ సంస్థ లైట్ బీమ్ లేజర్ ఇంటర్‌సెప్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తుంది. దీనిని వాషింగ్టన్ డీసీలో ప్రదర్శనకు ఉంచనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే యాంటీ ట్యాంక్ వ్యవస్థగా వాడుతున్న ట్రోఫీ వ్యవస్థలో దీనిని కూడా జోడించొచ్చు. దీనికి యాంటీ డ్రోన్ సామర్థ్యాన్ని కూడా జత చేయనున్నారు. షార్ట్ డిఫెన్స్‌లో ఇది మైలురాయిగా మారుతుందంటున్నారు. ఇప్పటికే ఐరన్ బీమ్ లేజర్ డిఫెన్స్ సిస్టమ్ పేరిట ఒక దానిని ఇప్పటికే రెడీ చేసింది.
Read Also: Micro Finance: మైక్రో ఫైనాన్స్ ఆగడాలు.. మహిళను 8 గంటల పాటు వేధించిన సిబ్బంది
కాగా, మరోవైపు లైట్ బీమ్ వ్యవస్థ సామర్థ్యాలను ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్మీ పరీక్షించింది. వీటిని గాజాలో లేదా లెబనాన్ యుద్ధంలో ఎక్కడ ఉపయోగించింది అనేది మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. ముఖ్యంగా డ్రోన్లపై ఇది సమర్థంగా పని చేయగలదని విశ్లేషకులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో మోర్టార్ దాడులను తట్టుకోవడానికి దీనిని ఉపయోగించే అవకాశం ఉంది. రాకెట్లు, దీర్ఘశ్రేణి క్షిపణులపై ఇది అనుకొన్నస్థాయిలో ఫలితాలను ఇవ్వలేదని పేర్కొన్నారు.
Read Also: Drugs in Birthday Party: బర్త్‌డే పార్టీలో డ్రగ్స్.. ముగ్గురు యువకుల అరెస్ట్..
ఇక, భవిష్యత్తులో ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థలు మొత్తం లేజర్‌పై ఆధారపడే ఛాన్స్ ఉంది. వీటిని ప్రయోగించడానికి కూడా చాలా తక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. ఫలితంగా ప్రస్తుతం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో వాడే క్షిపణుల వినియోగం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. లైట్‌బీమ్‌లో కాంతి వేగంతో శత్రు ఆయుధాలపై మెరుపు వేగంతో దాడి చేయడం, అతి తక్కువ ఖర్చు, అన్‌లిమిటెడ్ మ్యాగ్జైన్ లాంటి ఫీచర్లు సైన్యానికి బాగా కలిసొచ్చే అంశాలుగా మారనున్నాయి. దీనిని వ్యాన్‌లు, ట్రక్కులు, బ్యాటిల్ ట్యాంక్‌లపై పెట్టి ఉపయోగించవచ్చు. ప్రస్తుతం చాలా దేశాలు ఇజ్రాయెల్‌కు చెందిన ట్రోఫీ యాంటీ ట్యాంక్ వ్యవస్థను వినియోగిస్తున్నారు.