NTV Telugu Site icon

Qualcomm Snapdragon 8 Gen 2 SoC: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్‌సెట్ ఆవిష్కరణ.. కొత్త చిప్‌సెట్‌తో రాబోతున్న ఫోన్లు ఇవే..

Qualcomm Snapdragon 8 Gen 2 Soc

Qualcomm Snapdragon 8 Gen 2 Soc

Qualcomm Snapdragon 8 Gen 2 SoC officially unveiled: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 2 ఎస్ఓసీ చిప్ సెట్ ను అధికారంగా ఆవిష్కరించారు. బుధవారం జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ 2022లో తన కొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌ను ఆవిష్కరించింది. అంతకుముందు ఉన్న Gen 1+ SoC తర్వాత ఈ కొత్త చిప్ సెట్ వస్తోది. ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది Gen 1 చిప్ సెట్ తో పోలిస్తే 4.35 రెట్లు మెరుగైన ఏఐ సామర్థ్యాన్ని 40 శాతం ఎక్కువ పవర్ ఎఫిషియన్సీని కలిగి ఉంటుంది. దీంతో పాటు 25 శాతం వేగవమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్(GPU) సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలిపింది.

రాబోతున్న ఆసూస్ ఆర్ఓజీ, హానర్, ఐకూ, మోటరోలా, వన్ ప్లస్, ఒప్పో, రెడ్ మ్యాజిక్, రెడ్ మీ, సోని, వివో, షియోమీ మొబైళ్లలో తమ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్ సెట్ ఉపయోగించనున్నట్లు తెలిపింది. 2022 చివరి నాటికి వచ్చే ఫోన్లు ఈ ప్రాసెసర్ తో లాంచ్ అవుతాయిన భావిస్తున్నారు. ఈ కొత్త ప్రాసెసర్ ని అధికారికంగా SM8550-AB అని పిలుస్తారు. ఇది 4ఎన్ఎం ప్రాసెస్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు. ఇది ఏఐ, కనెక్టవిటీని మెరుగుపరిచేందుకు రూపొందించారు. ఈ హెగ్జాగోన్ ప్రాసెసర్ మల్టీ లాంగ్వేజ్ ప్రాసెసర్, అడ్వాన్సుడ్ ఏఐ కెమెరా ఫీచర్లను కలిగి ఉంటుంది.

Read Also: Twitter: ఈనెల 29 నుంచి మళ్లీ అందుబాటులోకి ‘బ్లూ టిక్’ సేవలు

ఫీచర్లు ఇవే..

కనెక్టవిటీతో పాటు, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 క్వాల్‌కామ్ యొక్క ఫాస్ట్‌కనెక్ట్ 7800 కనెక్టివిటీ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది హైస్పీడ్ ఇంటర్నెట్ (5.8జీబీపీఎస్) కోసం వైఫై 7ని సపోర్ట్ చేస్తుంది. 48kHz మ్యూజిక్ స్ట్రీమింగ్, గేమింగ్ ఫర్ఫామెన్సును మెరుగుపరుస్తుంది. 5జీ ఏఐ ప్రాసెసర్ తో స్నాప్‌డ్రాగన్ X70 5G మోడెమ్-RF సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది 10జీబీపీఎస్ డౌన్ లింగ్ వేగాన్ని, 3.5 జీబీపీఎస్ గరిష్ట అప్ లింక్ వేగాన్ని అందిస్తుంది. క్వాల్ కామ్, శామ్సంగ్ తో కలిసి

Show comments