Qatar Gas Plant Explosion: గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు
- 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖతార్‌లోని ప్రముఖ రాస్ లఫాన్ (Ras Laffan) పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న బర్జాన్ గ్యాస్ సరఫరా ప్లాంట్‌లో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 54 మంది కార్మికులు గాయపడగా, మరో 18 మంది ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పేలుడు అనంతరం ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో అత్యవసర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కార్యకలాపాల పునఃప్రారంభ సమయంలో ప్రమాదం
ఇరాన్‌తో జరిగిన ఘర్షణల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా ఖతార్ గ్యాస్ ఎగుమతులు ప్రభావితమయ్యాయి. అనంతరం పరిస్థితులు మెరుగుపడటంతో రాస్ లఫాన్ ఎగుమతి టెర్మినల్‌లో కార్యకలాపాలను పునఃప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Also Read
- MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
- Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం?
ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారుల్లో ఖతార్ ఒకటి. రాస్ లఫాన్ పారిశ్రామిక ప్రాంతం దేశంలోని ప్రధాన LNG (ద్రవీకృత సహజ వాయువు) ప్రాసెసింగ్, ఎగుమతి కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ కేంద్రంలో జరిగిన ప్రమాదం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
నష్టం అంచనా కొనసాగుతోంది
పేలుడు కారణంగా ప్లాంట్‌కు ఎంత మేర నష్టం వాటిల్లిందనే అంశంపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ఖతార్ అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించగా, గల్లంతైన 18 మంది కోసం శోధన చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపం కారణంగా పేలుడు సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
- Tags
- Gas Plant
- Qatar
- Ras Laffan
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!