NTV Telugu Site icon

Trump Effect: ట్రంప్ ఎఫెక్ట్ స్టార్ట్.. ఖతార్ నుంచి హమాస్ బహిష్కరణ..

Trump Effect

Trump Effect

Trump Effect: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు హమాస్ ఉగ్రవాదం సంస్థలకు మద్దతుగా వ్యవహరిస్తూ, హమాస్ నాయకులకు ఆశ్రయం ఇస్తున్న ఖతార్ తన వైఖరిని మార్చుకుంది. దోహాలో నివసిస్తున్న హమాస్ లీడర్లను బహిష్కరించేందుకు ఖతార్ అంగీకరించింది. అమెరికా నుంచి నుంచి వచ్చిన ఒత్తిడి తర్వాత ఖతార్ ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడితో రూ. 70 లక్షల రాబడి!.. అది కూడా కేవలం 14 నెలల్లోనే..

ఇజ్రాయిల్-హమాస్ వివాదంలో కాల్పుల విరమణ, బందీల విడుదల గురించి హమాస్‌తో అనేక నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఇప్పటికీ బందీల విడుదల గురించి హమాస్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ట్రంప్ గెలిచిన తర్వాత ఖతార్‌కి స్పష్టమైన ఆదేశాలు అందడంతో ఖతార్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ సంస్థ లీడర్లను బహిష్కరించేందుకు సిద్ధమైంది.

హమాస్ బందీల విడుదల విడుదల చేయడానికి, కాల్పులు విరమణ ప్రతిపాదనని ఇష్టపడకపోవడంపై ఖతార్ కూడా ఒకింత ఆగ్రహంగా ఉంది. ఈ పరిణామాలు అమెరికా ఇంట్రెస్ట్‌కి విరుద్ధంగా ఉన్నాయి. వారం క్రితమే హమాస్‌కి ఖతాన్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అమెరికన్-ఇజ్రాయిలీ బందీ అయిన హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్ మరణం తర్వాత హమాస్‌పై అమెరికా కోపంగా ఉంది. దీంతో హమాస్ నాయకుల్ని ఖతార్ బహిష్కరించాలనే విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది.

Show comments