NTV Telugu Site icon

Putin: అంతర్జాతీయ కోర్టు అరెస్ట్ వారెంట్.. తొలిసారిగా విదేశీ పర్యటనకు రష్యా అధినేత పుతిన్..

Putin

Putin

Putin: గతేడాది ఫిబ్రవరి తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సొంత దేశం వదిలి వేరే దేశ పర్యటనకు వెళ్లారు. యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కిర్గిజ్‌స్తాన్ పర్యటనక వెళ్లారు. గతంలో సోవియట్ యూనియన్ లో భాగమైన కిర్గిజ్‌స్తాన్, రష్యాతో బలమైన సంబంధాలను కలిగి ఉంది. ఆ దేశాధినేతతో గురువారం పుతిన్ చర్చలు జరిపారు.

Read Also: Rohit Sharma: ఆ క్రికెట్ దిగ్గజాలను అధిగమించిన ‘హిట్ మ్యాన్’.. వన్డే ప్రపంచకప్‌లో అరుదైన రికార్డ్

ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా కిర్గిజ్‌స్తాన్ వెళ్లారు. వచ్చే వారం బీజింగ్ లో జరిగే బెల్డ్ అండ్ రోడ్ ఫోరమ్ సమావేశం కోసం చైనాకు వెళ్లనున్నారు. యుద్ధనేరాలను విచారించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC)లో ఈ రెండు దేశాలు కూడా సభ్యులు కాదు. సోవియట్ యూనియన్ లోని దేశాల సమూహం అయిన కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్(CIS) సమావేశం కోసం ఆయన కిర్గిజ్‌స్తాన్ లో రెండు రోజుల పర్యటిస్తున్నారు.

ఇంతకుముందు ప్రపంచ స్థాయి కూటములైన బ్రిక్స్, జీ20 సమావేశాలకు కూడా పుతిన్ హాజరుకాలేదు. దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి, న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ రాకుండా ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీలావ్రోవ్ ని పంపించారు. తాజాగా కిర్గిజ్ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. గతంలో రష్యాకు ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, ఇతర సాంకేతికతను ఎగుమతి చేసినందుకు అమెరికా జూలై నెలలో 4 కిర్గిజ్ కంపెనీలపై ఆంక్షలు విధించింది.