Putin: G7పై సెటైర్లు, BRICSపై ప్రశంసలు.. వెస్ట్రన్ దేశాలకు పుతిన్ కౌంటర్..
- ప్రపంచ GDPలో బ్రిక్స్ వాటా 40%కి పైగా ఉందన్న పుతిన్..
- G7 వాటా కేవలం 29% మాత్రమేనని వ్యాఖ్య..
- ‘గ్రూప్ ఆఫ్ సెవెన్’ అని ఎందుకు పిలుస్తారో తెలియదంటూ వ్యంగ్యాస్త్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీకి వచ్చారు. శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. బ్రిక్స్ బిజినెన్ సమ్మిట్ 2026లో పుతిన్ మాట్లాడుతూ, వెస్ట్రన్ దేశాలను ఎగతాళి చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ ప్రాధాన్యం పెరుగుతోందని, G7 వాటా తగ్గుతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో G7 దేశాల వాటా సుమారు 18 శాతం కాగా, బ్రిక్స్ దేశాల వాటా దాదాపు 40 శాతంగా ఉందని పుతిన్ పేర్కొన్నారు. ‘‘వాళ్లను ‘గ్రూప్ ఆఫ్ సెవెన్’ అని ఎందుకు పిలుస్తారో నాకు తెలియదు’’ అంటూ జీ 7 పేరును ప్రస్తావించకుండానే పుతిన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ తన బలాన్ని, ప్రభావాన్ని పెంచుకుంటోందని అన్నారు.
గతంలో రష్యా G8లో సభ్యదేశంగా ఉండేది. 2014లో క్రిమియాను రష్యా విలీనం చేసుకున్న తర్వాత గ్రూప్ నుంచి తొలగించారు. దీంతో ఇప్పుడు G7గా మారింది. G7 అనేది ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఏడు దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా ఉన్నాయి.
Also Read
- Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో బ్రిక్స్ అతిపెద్ద ఆర్థిక కూటమిగా మారిందని పుతిన్ అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ అందిస్తున్న సహకారం కూడా పెరుగుతోందని అన్నారు. బ్రిక్స్ కూటమి వెలుపల ఉన్న దేశాలతోనూ సహకారం కొనసాగించేందుకుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ తెలిపారు. పశ్చిమ దేశాలు బ్రిక్స్ కూటమి ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, తమ పాత ఆధిపత్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రష్యాపై వెస్ట్రన్ దేశాలు విధించిన ఆంక్షల్ని పుతిన్ విమర్శించారు. అన్యాయమైన ఆంక్షలు విధించినప్పటికీ రష్యా తన ఆర్థిక పనితీరును కొనసాగిస్తుందని చెప్పారు.
బ్రిక్స్‌లో మొత్తం 21 సభ్య దేశాలు..
గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రాతినిధ్యం వహించేందుకు బ్రిక్స్ కూటమి విస్తరిస్తోంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ప్రధాన సభ్య దేశాలుగా ఏర్పడిన ఈ కూటమిలో ప్రస్తుతం 11 పూర్తి సభ్య దేశాలు ఉన్నాయి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా తదితర దేశాలు పూర్తి సభ్యులుగా ఉన్నాయి. మరో 10 దేశాలు భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Putin: G7పై సెటైర్లు, BRICSపై ప్రశంసలు.. వెస్ట్రన్ దేశాలకు పుతిన్ కౌంటర్..
-
Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
-
PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?