Site icon NTV Telugu

Putin: “ట్రంప్ గెలిచినా, బైడెన్ గెలిచానా”.. వీ డోంట్ కేర్

Putin

Putin

Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పోటీలో ఉన్నారు. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలిస్తే రష్యా పట్ల అమెరికా విధానంలో పెద్ద మార్పులు వస్తాయని తాను ఊహించనని, అయితే ఆలోచనలో మార్పుని మాత్రం తోసిపుచ్చలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం అన్నారు.

Read Also: Criminal Cases On MP: వామ్మో.. కొత్తగా ఎన్నికైన ఎంపీలలో అంతమందిపై క్రిమినల్ కేసులు..

సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఎకనామిక్ ఫోరమ్‌లో మీడియా ఎడిటలర్స్‌తో మాట్లాడుతూ, అమెరికాలో ఎవరు గెలిచినా మేము పట్టించుకోమని అన్నారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తప్పు చేస్తో్ందని, యూఎస్ రాజకీయ వ్యవస్థ ప్రపంచ నాయకత్వాన్ని దహనం చేస్తోందని పుతిన్ ఆరోపించారు. అమెరికా ఎన్నికల ఫలితాలు రష్యాపై ఆ దేశ విధానాలను మార్పు తెస్తాయని తాను అనుకోవడం లేదని అన్నారు. మాస్కో ఎవరు గెలిచినా కూడా వారితో కలిసి పనిచేస్తుందని అన్నారు. అమెరికా రాజకీయాల్లో జోక్యం చేసుకోమని అన్నారు.

నిజానికి ట్రంప్‌తో రష్యారు ఎప్పుడూ ప్రత్యేక సంబంధాలు లేవని, వాస్తవానికి అతను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యాపై భారీ ఆంక్షలు విధించడం ప్రారంభించారని అన్నారు. అతను ఇంటర్మీడియట్-షార్ట్ రేంజ్ మిస్సైల్ ఒప్పందం నుంచి వైదొలిగాడని పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా, వెస్ట్రన్ దేశాలు రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఆ దేశానికి సాయం చేస్తుండటం కూడా పుతిన్‌కి నచ్చడం లేదు.

Exit mobile version