Site icon NTV Telugu

Putin-Shehbaz Sharif: పాక్ ప్రధానికి మళ్లీ అవమానం.. షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు పుతిన్ నిరాకరణ.. చివరికిలా..!

Putin2

Putin2

చైనా వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సదస్సు ఆద్యంతం ఆసక్తి రేపతోంది. ప్రధాని మోడీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ మాటిమాటికీ ఎక్కడ కలిసినా నవ్వుకుంటూ.. సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. సమావేశానికి ముందు గ్రూప్ ఫొటో దిగేందుకు వెళ్తుండగా మోడీ-పుతిన్ ఎవరినీ పట్టించుకోలేదు. పక్కనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిలబడి ఉన్నా.. అటువైపు చూడకుండానే వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్‌కు మోడీ బిగ్ షాక్.. పట్టించుకోని ప్రధాని

మరొకసారి కూడా పాక్ ప్రధానికి అదే భంగపాటు ఎదురైంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. దేశాధినేతల కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం మరొకసారి ఫ్యామిలీలతో గ్రూప్ ఫొటో దిగారు. ఫొటో దిగి వెళ్లిపోతుండగా ఆ సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పుతిన్ నిరాకరించారు. కనీసం అటువైపు చూసేందుకు కూడా ఇష్టపడలేదు. ఇంతలో షెహబాజే.. పుతిన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: PM Modi: మోడీ-పుతిన్-జిన్‌పింగ్ సంభాషణ.. ఎక్స్‌లో ఫొటోలు పెట్టిన మోడీ

ఇక మోడీ-పుతిన్ కలిసినప్పుడూ ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకుని నవ్వుకుంటూ కనిపించారు. ఈ సమావేశం తర్వాత ద్వైపాక్షిక చర్చల కోసం మోడీ-పుతిన్ ఒకే కారులు వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కోసం భారత్, చైనా చేసిన కృషిని పుతిన్ ప్రశంసించారు.

Exit mobile version