NTV Telugu Site icon

Naftali Bennett: జెలన్ స్కీని చంపనని పుతిన్ ప్రామిస్ చేశాడు.. ఇజ్రాయిల్ మాజీ పీఎం

Putin , Zelensky

Putin , Zelensky

Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఈ నెలలో ఏడాదికి చేరింది. ఏడాది కాలంగా ఇరు దేశాలు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని ఉన్నాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ లోని ఖేర్సన్, జపోరొజ్జియా, లూహాన్స్క్, డోనాట్స్క్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఉక్రెయిన్ అమెరికా, యూరప్ దేశాలు, ఇతర నాటో దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సహకారంతో రష్యాతో పోరాడుతోంది.

Read Also: MP K.Laxman : ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుంది

ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ ఈ యుద్ధంపై ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని చంపనని రష్యా అధ్యక్షుడు పుతిన్ వాగ్ధానం చేసినట్లు వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభ రోజుల్లో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేసిన కొద్దిమంది నాయకుల్లో నఫ్తాలీ బెన్నట్ ఒకరు. గతేడాది మార్చిలో రష్యా పర్యటనకు వెళ్లారు నఫ్తాలీ బెన్నెట్. ఆ సమయంలో పుతిన్ తో సమావేశం అయ్యారు. సమావేశంలో మీరు జెలన్ స్కీని చంపుతారా..? అని బెన్నెట్ పుతిన్ ను ప్రశ్నించారు. అయితే దీనికి పుతిన్ ‘నేను జెలన్ స్కీని చంపను’ అని చెప్పినట్లు బెన్నెట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నువ్వు జెలన్ స్కీని చంపనని నాకు మాట ఇస్తున్నావని పుతిన్ తో అన్నట్లు బెన్నెట్ చెప్పారు.

ఈ సమావేశం అనంతరం తాను జెలన్ స్కీకి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పానని బెన్నెట్ తెలిపారు. పుతిన్ నిన్ను చంపరని చెప్పారని ..అందుకు మీరు ఖచ్చితంగా ఉన్నారా..? అని జెలన్ స్కీ ప్రశ్నించారని.. అందుకు తాను 100 శాతం అతను మిమ్మల్ని చంపడని చెప్పానని బెన్నెట్ అన్నారు. బెన్నెట్ ఇజ్రాయిల్ కు గతేడాది ఆరు నెలలు ప్రధాని మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత ఇటీవల బెంజిమన్ నెతన్యాహు ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ప్రధాని అయ్యారు.

Show comments