Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
- నాటో సభ్యదేశంపై దాడికి రష్యా ప్లాన్..
- నాటో కూటమిలో విభేదాలకు ప్రయత్నం..
- అమెరికా ఇంటెలిజెన్స్ కీలక నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రానున్న కాలంలో నాటో కూటమిలోని ఏదో ఒక సభ్యదేశంపై దాడి చేసే అవకాశం ఉందని అమెరినా నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. నాటో ఐక్యతను పరీక్షించేందుకు ఈ దాడికి యత్నించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ దాడి సైబర్ దాడులు, రహస్య ఆపరేషన్లు, తూర్పు నాటో సరిహద్దులో చిన్నస్థాయి సైనిక చొరబాటు రూపంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విషయాలను వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
ఇప్పటి వరకు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తలమునకలై ఉంది. దీని వల్ల నాటోతో నేరుగా తలపడేందుకు పుతిన్ వెనకాడుతారని అమెరికా భావించింది. అయితే, రష్యాపై పెరుగుతున్న ఒత్తిడి, ఉక్రెయిన్ డ్రోన్ దాడులు, యుద్ధంలో రష్యా వెనకబడిపోవడం వంటి పరిణామాలతో అమెరికా అంచనాల్లో మార్పులు వచ్చినట్లు నివేదిక వెల్లడించింది.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
అమెరికా అధికారులు చెబుతున్నదాని ప్రకారం.. నాటో భూభాగాలను ఆక్రమించుకోవడం రష్యా లక్ష్యం కాదని, నాటో దేశాల మధ్య విభేదాలు సృష్టించడమే పుతిన్ లక్ష్యమని చెబుతున్నారు. గతంలో పోలాండ్, రొమేనియా లోకి రష్యా క్షిపణులు వెళ్లడం, గగనతలంలో డ్రోన్లు ప్రవేశించడం వంటివ ఘటనలను హెచ్చరిక సంకేతాలు పరిగణిస్తున్నారు. ఈ ఏడాది నుంచి 2029 మధ్య ఇలాంటి చర్యలకు రష్యా పాల్పడే అవకాశం ఉందని అమెరికన్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే, రష్యా నేరుగా నాటో భూభాగంపై దాడి చేసే అవకాశం తక్కువగా ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఇది నాటో లోని ఆర్టికల్ -5ను అమలు చేసే పరిస్థితికి దారి తీయొచ్చు. దీని ప్రకారం, నాటోలోని ఒక్క సభ్య దేశంపై దాడి చేసినా మొత్తం కూటమిపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుంది. రష్యాపై చర్యలకు మొత్తం నాటో కూటమి ఏకమయ్యే అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 5 స్థాయికి చేరుకోని దాడులను రష్యా నిర్వహిస్తుందని భావిస్తున్నారు. దీనికి 2007లో ఎస్టోనియాపై జరిగిన రష్యా సైబర్ దాడుల్ని ఉదాహరణగా చూపుతున్నారు.
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!