NTV Telugu Site icon

Modi-Purin: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోడీ-పుతిన్ చర్చలు

Modiputrin

Modiputrin

ప్రధాని మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజాన్ చేరుకున్నారు. బ్రిక్స్ సమావేశంలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. అద్భుతమైన సమావేశం జరిగిందని మోడీ పేర్కొన్నారు. భారతదేశం- రష్యా మధ్య బంధం మరింత లోతుగా బలపడుతుందని తెలిపారు. విభిన్న రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మరింత శక్తిని ఇస్తుందన్నారు. అనంతరం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఇతర దేశాధినేతలతో కూడా ప్రధాని సమావేశం కానున్నట్లు సమాచారం.

రష్యాలో లభించిన సాదర స్వాగతంపై మోడీ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం అందమైన కజాన్ నగరాన్ని సందర్శించినందుకు సంతోషిస్తున్నాను. రష్యాతో భారతదేశానికి చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కొత్త భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ఆ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి’’ అని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇతర నేతలు పాల్గొంటారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్‌ కూటమి ఏర్పాటైంది. ఇప్పుడు దాన్ని విస్తరించి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలకు సభ్యత్వం ఇచ్చారు. కూటమి విస్తరణ తర్వాత ఇదే తొలి శిఖరాగ్ర సదస్సు. ప్రధాని మోడీ రష్యా పర్యటన చేపట్టడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.