Skirts: అమ్మాయిలు “స్కర్టులు” ధరించడాన్ని నిషేధించిన ప్రైమరీ స్కూల్.. కారణం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ban Skirts: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లోని ఓ ప్రైమరీ స్కూల్ అమ్మాయిలు స్కర్టులు ధరించడాన్ని నిషేధించాలని కోరుతోంది. అమ్మాయిలు స్కర్టులను మరింత పోట్టిగా ధరిస్తున్నారనే ఆందోళల కారణంగా వాటిపై నిషేధం విధిస్తున్నట్లు అక్కడి మీడియా నివేదించింది. కార్న్‌వాల్‌లోని న్యూక్వే జూనియర్ అకాడమీ సెప్టెంబర్ నుంచి స్కర్టులపై నిషేధం అమలు చేయాలని భావిస్తున్నట్లు తల్లిదండ్రులకు లేఖ రాసింది. ఒక వేళ ఇది ఆమోదం పొందితే, మహిళా విద్యార్థులు ప్యాంటు లేదా, టైలర్డ్ షార్ట్స్ ధరించాల్సి ఉంటుంది.
ఎగ్జిక్యూటివ్ హెడ్ టీచర్ క్రెయిగ్ హేస్ తల్లిదండ్రులకు రాసిన లేఖ ఇలా పేర్కొంది. ‘‘ మా యూనిఫాం విధానంలో ఇకపై స్కర్టులు ధరించే అవకాశం ఉండదు. బదులుగా ప్యాంట్లు, టైలర్డ్ బ్లాక్ స్కూట్ షార్ట్స్ ప్రతిపాదిస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే, అమ్మాయిలలో కొందరు తమ స్కర్టులను ధరించే విధానం గురించి మేము ఆందోళన చెందుతున్నాము. ఈ ఆందోళనలు కొందరు తల్లిదండ్రులు, సంరక్షులు, సందర్శకుల నుంచి వచ్చాయి. కొన్ని స్కర్టులు చాలా చిన్నవిగా ఉన్నాయి, స్కర్టు పొడవును సరిదిద్దడం కష్టంగా ఉంది. ఇప్పుడు దీన్ని పరిస్కరిస్తున్నాము. సెప్టెంబర్ 2024లో స్కర్టుకు బదులు అందరికీ ప్యాంటు ధరించే ఆలోచన ఉంది.’’ అని చెప్పింది.
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
Read Also: Bomb Threat: కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు..
విద్యార్థులు స్టేటస్ సింబల్, ట్రెండ్స్‌కి అనుగుణం ధరించాలనే ఒత్తిడికి గురికాకుండా, సమానత్వాన్ని అనుగుణంగా ధరించే యూనిఫాం ఉత్తమమైన మార్గంగా తాము విశ్వసిస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం లేఖలో పేర్కొంది. ఉహించిన విధంగా యూనిఫాం ధరించడం ఖరీదైన బూట్లు, లేబుల్స్, స్కర్టు పొడవు వంటి వాటిని పరిష్కరిస్తుందని, హోదా కనిపించకుండా సమానత్వాన్ని అందిస్తుందని లేఖలో పేర్కొన్నారు. మే హాఫ్ టర్మ్ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని పాఠశాల తెలిపింది.
అయితే, పాఠశాల ఇలా పేర్కొనడంపై పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ నిర్ణయాన్ని కించపరుస్తున్నారు. యువ విద్యార్థులు ఏం ధరించాలో చెప్పడం సంతోషంగా లేదని, అమ్మాయిలు తనకు అసౌకర్యంగా ఉండే యూనిఫాం ధరించమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఓ మహిళ కామెంట్ చేసింది. దీనిపై నిషేధం వెర్రితనంగా అనిపిస్తుందని చెప్పింది. గతంలో డెవాన్‌లోని టివెర్టన్ హైస్కూల్ కూడా ఇలాగే స్కర్టులపై నిషేధం విధించినప్పటికీ, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రణాళికను మార్చింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!