NTV Telugu Site icon

Skirts: అమ్మాయిలు “స్కర్టులు” ధరించడాన్ని నిషేధించిన ప్రైమరీ స్కూల్.. కారణం ఏంటంటే..?

Ban Skirts

Ban Skirts

Ban Skirts: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లోని ఓ ప్రైమరీ స్కూల్ అమ్మాయిలు స్కర్టులు ధరించడాన్ని నిషేధించాలని కోరుతోంది. అమ్మాయిలు స్కర్టులను మరింత పోట్టిగా ధరిస్తున్నారనే ఆందోళల కారణంగా వాటిపై నిషేధం విధిస్తున్నట్లు అక్కడి మీడియా నివేదించింది. కార్న్‌వాల్‌లోని న్యూక్వే జూనియర్ అకాడమీ సెప్టెంబర్ నుంచి స్కర్టులపై నిషేధం అమలు చేయాలని భావిస్తున్నట్లు తల్లిదండ్రులకు లేఖ రాసింది. ఒక వేళ ఇది ఆమోదం పొందితే, మహిళా విద్యార్థులు ప్యాంటు లేదా, టైలర్డ్ షార్ట్స్ ధరించాల్సి ఉంటుంది.

ఎగ్జిక్యూటివ్ హెడ్ టీచర్ క్రెయిగ్ హేస్ తల్లిదండ్రులకు రాసిన లేఖ ఇలా పేర్కొంది. ‘‘ మా యూనిఫాం విధానంలో ఇకపై స్కర్టులు ధరించే అవకాశం ఉండదు. బదులుగా ప్యాంట్లు, టైలర్డ్ బ్లాక్ స్కూట్ షార్ట్స్ ప్రతిపాదిస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే, అమ్మాయిలలో కొందరు తమ స్కర్టులను ధరించే విధానం గురించి మేము ఆందోళన చెందుతున్నాము. ఈ ఆందోళనలు కొందరు తల్లిదండ్రులు, సంరక్షులు, సందర్శకుల నుంచి వచ్చాయి. కొన్ని స్కర్టులు చాలా చిన్నవిగా ఉన్నాయి, స్కర్టు పొడవును సరిదిద్దడం కష్టంగా ఉంది. ఇప్పుడు దీన్ని పరిస్కరిస్తున్నాము. సెప్టెంబర్ 2024లో స్కర్టుకు బదులు అందరికీ ప్యాంటు ధరించే ఆలోచన ఉంది.’’ అని చెప్పింది.

Read Also: Bomb Threat: కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు..

విద్యార్థులు స్టేటస్ సింబల్, ట్రెండ్స్‌కి అనుగుణం ధరించాలనే ఒత్తిడికి గురికాకుండా, సమానత్వాన్ని అనుగుణంగా ధరించే యూనిఫాం ఉత్తమమైన మార్గంగా తాము విశ్వసిస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం లేఖలో పేర్కొంది. ఉహించిన విధంగా యూనిఫాం ధరించడం ఖరీదైన బూట్లు, లేబుల్స్, స్కర్టు పొడవు వంటి వాటిని పరిష్కరిస్తుందని, హోదా కనిపించకుండా సమానత్వాన్ని అందిస్తుందని లేఖలో పేర్కొన్నారు. మే హాఫ్ టర్మ్ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని పాఠశాల తెలిపింది.

అయితే, పాఠశాల ఇలా పేర్కొనడంపై పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ నిర్ణయాన్ని కించపరుస్తున్నారు. యువ విద్యార్థులు ఏం ధరించాలో చెప్పడం సంతోషంగా లేదని, అమ్మాయిలు తనకు అసౌకర్యంగా ఉండే యూనిఫాం ధరించమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఓ మహిళ కామెంట్ చేసింది. దీనిపై నిషేధం వెర్రితనంగా అనిపిస్తుందని చెప్పింది. గతంలో డెవాన్‌లోని టివెర్టన్ హైస్కూల్ కూడా ఇలాగే స్కర్టులపై నిషేధం విధించినప్పటికీ, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రణాళికను మార్చింది.