Site icon NTV Telugu

Russia-Ukraine: శాంతి చర్చల్లో భాగంగా రష్యా ఏం చేసిందంటే…!

Putin

Putin

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగింపునకు అడుగులు పడుతున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియాలో రష్యాతో చర్చలు జరుగుపుతోంది. తొలుత తమ పాత్ర లేకుండా చర్చలు జరపడంపై ఉక్రెయిన్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. తాజాగా శాంతి చర్చలకు ఓకే చెప్పింది. ఇక రష్యా కూడా ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించడానికి సుముఖంగా ఉంది. అలాగే అమెరికాతో కూడా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి సిద్ధపడింది. ఈ నేపథ్యంలో ఒప్పందానికి సంబంధించిన డిమాండ్లను రష్యా.. అమెరికాకు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: SRH Players: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కూతురు రిసెప్షన్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్ ఆటగాళ్లు.. వీడియో వైరల్!

ఇదిలా ఉంటే గత మూడు వారాలుగా రష్యన్-అమెరికా అధికారులు సౌదీ అరేబియాలో శాంతి చర్చలు జరుపుతున్నారు. కొందరు వ్యక్తితంగా.. ఇంకొందరు వర్చువల్‌గా కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. ఇక ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వకూడదని.. అలాగే ఉక్రెయిన్ నుంచి విదేశీ దళాలు ఉపసంహరించుకోవాలని రష్యా డిమాండ్ చేసినట్లు సమాచారం. మొత్తానికి శాంతి చర్చలు సఫలీకృతం అయ్యేలా కనిపిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే… బాంబు మోతకు ఫుల్ స్టాఫ్ట్ పడనుంది.

ఇది కూడా చదవండి: Abid Ali Death: హైదరాబాద్‌ దిగ్గజ క్రికెటర్‌ కన్నుమూత.. భారత్‌ తరఫున తొలి బంతి వేసిన ఘనత!

గత మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగింది. వైమానిక దాడుల్లో ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. అలాగే అమెరికా సాయంతో ఉక్రెయిన్ కూడా రష్యాపై దాడులకు తెగబడింది. వందిలాది మంది ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే డొనాల్డ్ ట్రంప్.. రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక.. ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి చర్చలకు పూనుకున్నారు.

ఇది కూడా చదవండి: Astrology: మార్చి 13, గురువారం దినఫలాలు

Exit mobile version