పోప్ ఫ్రాన్సిస్ భారత్ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ తెలిపారు. శనివారం వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ చేత కార్డినల్‌గా ఆర్చ్‌బిషప్ జార్జ్ జాకబ్ కూవకాడ్‌కు పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర ప్రతినిధి బృందంలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కురియన్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2025 జూబ్లీ సంవత్సరం తర్వాత పోప్ ఫ్రాన్సిస్ భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Nagarjuna: ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్.. జోరు మీదున్న మన్మధుడు
భారత్‌లో పర్యటించాలని ఇప్పటికే ప్రధాని మోడీ.. పోప్ ఫ్రాన్సిస్‌ను ఆహ్వానించారని గుర్తుచేశారు. ఈ ఏడాది జూన్‌లో దక్షిణ ఇటలీలోని అపులియాలో జరిగిన G7 సమ్మిట్‌లో ప్రధాని మోడీ-పోప్ ఫ్రాన్సిస్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో పర్యటించాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్‌ను మోడీ ఆహ్వానించారని కేంద్రమంత్రి తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ భారత పర్యటన కోసం ప్రధాని మోడీ, క్రైస్తవ సమాజం ఎదురుచూస్తోందన్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan : చదువు ఉద్యోగం కోసమే కాదు జ్ఞానం సంపాదించుకోవడానికి…
కేరళకు చెందిన కూవకాడ్ (51). కార్డినల్ స్థాయికి ఎదిగిన 21 మంది మతాధికారులలో ఒకరిగా నిలిచారు. గతంలో మోన్సిగ్నోర్ బిరుదును కలిగి ఉన్నారు. టర్కీలోని నిసిబిస్ టైటిల్ ఆర్చ్ బిషప్‌గా ప్రకటించబడ్డారు. శనివారం వాటికన్ సిటీలో కూవకాడ్‌కు పోస్ చేత కార్డినల్‌గా పట్టాభిషేకం జరగనుంది.
ఇది కూడా చదవండి: Parenting Tips: పిల్లలు పేరెంట్స్ మాట వినేలా చేయడం ఎలా? సింపుల్ టిప్స్..