ఈ కాలంలో పిల్లలు చాలా మొండిగా తయారవుతున్నారు. తల్లిదండ్రుల మాటలు పట్టించుకోవడం లేదు.
వాళ్ల మారాం తగ్గి మీరు చెప్పినట్లు వినాలంటే ఈ టిప్స్ పాటించండి.
ముఖ్యంగా పిల్లలు మీ మాటల వినాలంటే.. మీ ప్రవర్తన ఆదర్శంగా ఉండాలి. మీరే చెడుపనులు చేస్తూ వారికి చెబితే అస్సలు వినరు.
పిల్లలను కోపంగా పిలవద్దు. వారిని చక్కగా పిలవండి. ఎంత ప్రేమగా పిలిస్తే వారు మీ దగ్గరికి వస్తారు.
పిల్లలకి ఏదైనా చెబుతున్నప్పుడు వారి కళ్ళు చూస్తూ మాట్లాడాలి. అలా చేస్తేనే వారికి అది ఇంపార్టెన్స్ అని అర్థమవుతుంది.
అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని ఆంక్షలు పెట్టే బదులు.. వారికి అలా చేస్తే ఏమవుతుందో సర్ది చెప్పాలి.
ఏదైనా ఎంచుకునేటప్పుడు వారికి ఛాన్స్ ఇవ్వండి. ఏది కావాలో అది తీసుకోమని చెప్పండి.
అదే విధంగా వారు ఏదైనా పనిచేసినప్పుడు వారిని మెచ్చుకోండి. దీంతో వారు మరిన్ని మంచి పనులు చేసేందుకు ట్రై చేయండి.
దీంతోపాటు వారు మాట వినకపోతే కారణం ఏంటో కనుక్కుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి.
పిల్లలు మరి మొండిగా ఉన్నప్పటికీ శిక్షలు వేయాలి. కానీ.. శారీరకంగా, మానసికంగా బాధించేలా ఉండొద్దు.
ఈ టిప్స్ ఫాలో అయితే వారు కచ్చితంగా మీ మాట వింటారు.