NTV Telugu Site icon

Canada: 125 సంస్థలకు బాంబు బెదిరింపులు.. యూదులు లక్ష్యంగా హెచ్చరికలు

Canada2

Canada2

కెనడాలో ఒకేసారి 125 సంస్థలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. మాల్స్, ఆస్పత్రులకు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులన్నీ ప్రధానంగా యూదులు లక్ష్యంగా వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు, డాగ్ స్క్వాడ్స్, బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు. ఇదిలా ఉంటే మంగళవారం ఢిల్లీలో కూడా ఇదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ, కెనడాకు వచ్చిన మెయిల్స్ చెక్ చేయగా.. ఒకే రకమైన మేటర్ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మెయిల్స్ బెదిరింపులపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. యూదులు ఈ భూమ్మీద జీవించడానికి అర్హులు కాదంటూ సందేశంలో హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: అచ్యుతాపురం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి.. గాయపడ్డవారికి రూ.50 లక్షలు..

ఇదిలా ఉంటే కెనడాలో 100 శాతానికి పైగా ఆయా సంస్థలు యూదులకు సంబంధించినవే ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్-గాజా-హెజ్బొల్లా మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూదులు లక్ష్యంగా బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: E-SHRAM: కార్మికుల కష్టానికి “ఈ-శ్రమ్” సాయం.. ఈ కార్డు మీతో ఉంటే నెలకు రూ. వెయ్యి!

యూదులకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు, ఆస్పత్రులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ మెయిల్స్‌ ప్రకారం ఆయా సంస్థలను పరిశీలించినట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు తెలిపారు. టొరంటో, మాంట్రియల్, కాల్గరీ, వాంకోవర్, హామిల్టన్, ఒట్టావాతో సహా అన్ని ప్రధాన కెనడియన్ పట్టణ కేంద్రాలకు బెదిరింపులు వచ్చాయి. ఆస్పత్రులను లక్ష్యంగా వార్నింగ్‌లు ఇచ్చారు. ఇక ఈ బెదిరింపులను కెనడా ప్రధానమంత్రి ట్రూడో ఖండించారు. యూదులు లక్ష్యంగా బెదిరింపులు రావడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి బెదిరింపులు సబబు కాదని పేర్కొన్నారు. ఇది కఠోరమైన సెమిటిజం అని ఆయన చెప్పారు.

ఇది కూడా చదవండి: India Tour to England: భారత్-ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్‌ విడుదల..

ఢిల్లీలో బెదిరింపుల సారాంశం ఇదే.. ‘‘భవనాల్లో పేలుడు పదార్థాలు ఉంచాం. నల్ల బ్యాక్‌ప్యాక్‌ల్లో ఉంచాం. మరికొద్ది గంటల్లో బాంబులు పేలనున్నాయి. మీరంతా రక్తపు మడుగుల్లో పడిపోతారు. మీలో ఎవరూ జీవించే అర్హత లేదు. భవనంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాణాలు కోల్పోతారు.’’ అంటూ ఎన్‌సీఆర్ పాఠశాలలను లక్ష్యంగా సందేశం వచ్చింది. ఇలాంటి సందేశమే కెనడా సంస్థలకు వచ్చాయి. ప్రస్తుతం కెనడా అధికారులు అంతర్జాతీయ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.