NTV Telugu Site icon

PM Modi: బ్యాంకాక్ చేరుకున్న మోడీ.. ఘనస్వాగతం

Modi

Modi

ప్రధాని మోడీ బ్యాంకాక్ చేరుకున్నారు. అక్కడ ఘనస్వాగతం లభించింది. రెండు దేశాల పర్యటన కోసం గురువారం బయల్దేరి వెళ్లారు. నేటి నుంచి థాయ్‌లాండ్, శ్రీలంకలో పర్యటించనున్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్టులో దిగగానే మోడీకి ఘనస్వాగతం లభించింది. థాయ్‌లాండ్ అధికారులతో పాటు భారతీయులు భారీ స్వాగతం పలికారు.

ఇది కూాాడా చదవండి: Soniya Gandhi: దేశ విభజన కోసమే వక్ఫ్ బిల్లు ఆమోదం

నేటి నుంచి రెండు రోజుల పాటు థాయ్‌లాండ్‌లో మోడీ పర్యటించనున్నారు. థాయ్‌లాండ్‌లో 6వ బిమ్‌స్టెక్‌(BIMSTEC Summit) శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొనన్నారు. పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్‌ ప్రధాని పేటోంగ్‌టార్న్‌ షినవత్రాతో కూడా భేటీ అయి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఇక సాయంత్రం బిమ్‌స్టెక్‌ సదస్సులో మోడీ పాల్గొంటారు. ఈ సదస్సులో భారత్‌తో పాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్‌ దేశాల అధినేతలు పాల్గొననున్నారు. ఇక ఈ సదస్సులో సాంకేతిక, ఆర్థిక సహకారంపై చర్చించనున్నారు.